గుర్రాల మధ్య అఖిల్ స్వారీ

0

పరిశ్రమకు వచ్చి మూడేళ్లయినా రెండు పరాజయాలతో స్లో అయిపోయి  ఈసారి గట్టి హిట్టు కొట్టాలనే  కసిమీదున్న అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఈ కథను ఎంచుకోవడానికి ఆరు నెలల టైం తీసుకున్న నాగ్ వారసుడు నాలుగో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అది పినిశెట్టి అన్నయ్య మలుపు దర్శకుడు సత్య ప్రభాస్ గత కొంత కాలంగా అఖిల్ తో టచ్ లో ఉంటూ కథ విషయంగా చర్చలు జరుపుతున్నట్టు వార్తలు గతంలో వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతున్నట్టు తెలిసింది.

ఇందులో అఖిల్ గుర్రపు స్వారీ చేసే యువకుడిగా కొత్త తరహాలో కనిపించేలా సత్య డిజైన్ చేసినట్టు టాక్. రొమాన్స్ యాక్షన్ థ్రిల్ అన్ని సమపాళ్లలో ఉంటూనే సరికొత్త అనుభూతినిచ్చేలా ఇది రాసుకున్నట్టు సమాచారం. హీరోలు జాకీలుగా నటించిన సినిమాలు చాలా తక్కువ. 80వ దశకంలో బాగానే వచ్చేవి కానీ ఈ లైన్ మీద తెలుగులో మాత్రం రావడం మానేశాయి. ఆ రకంగానూ ఇది ఫ్రెష్ గా అనిపిస్తుందని సత్య ప్రభాస్ నమ్మకంగా ఉన్నాడట. షూటింగ్ ప్రారంభానికి కొంత టైం పట్టొచ్చు. మిస్టర్ మజ్ను పూర్తి చేసి దాని ప్రమోషన్ ఒక కొలిక్కి వచ్చే దాకా అఖిల్ అందులోనే బిజీగా ఉంటాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న మిస్టర్ మజ్నులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రేసీ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ పూర్తి కాగానే సత్య ప్రభాస్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందట.