కశ్మీర్ టూర్ లో పవన్ వారసుడు

0

పరిశ్రమలో నటవారసుల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడిగా అఖీరా నందన్ హీరో అవుతాడా? ఒకవేళ బరిలోకొస్తే ఎప్పుడు పూర్తి స్థాయిలో దిగుతాడు? అంటూ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే అఖీరా నందన్ ప్రస్తుతం అకడమిక్ స్టడీస్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఇక ఇప్పటికే అఖీరా నందన్ సామాజిక మాధ్యమాల్లోనూ అభిమానులకు టచ్ లో ఉన్నాడు. ఏపీ ఎన్నికల వేళ తన తండ్రి పవన్ కల్యాణ్ కి మద్ధతునిస్తూ జనసేనకు ఓటేయాలని ప్రచారం చేశాడు అఖీరా. నిరంతరం పవర్ స్టార్ అభిమానులకు ఏదో ఒక సమాచారం చేరవేస్తూనో లేదా ఫోటోల్ని షేర్ చేస్తూనే టచ్ లో ఉంటున్నాడు. మరోవైపు మామ్ రేణు దేశాయ్ సినిమాల నిర్మాణం.. బుల్లితెర షోలు అంటూ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటే తనకు మద్ధతుగా నిలుస్తున్నాడు. అలాగే అఖీరా నందన్ ని పరిచయం చేస్తూ రేణు ఇష్క్ వాలా లవ్ అనే చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.

ఇదిగో కాసింత తీరిక సమయం చిక్కితే అలా కశ్మీర్ పర్యటనకు వెళ్లాడు. అది కూడా మామ్ రేణు దేశాయ్ తో కలిసి జాలీ ట్రిప్ ని ఆస్వాధిస్తున్నాడు. జమ్ము కశ్మీర్ లోని సోనామార్గ్ ప్రాంతంలో షికార్ చేస్తున్న దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు షేర్ చేశారు రేణూ. “ఈ లిటిల్ బోయ్ పై అమ్మ ప్రేమ ఎంత? అన్నది వర్ణించేందుకు మాటలు చాలవు.. రచనలు చాలవు“ అంటూ కాస్త పోయెటిక్ గానే స్పందించారు రేణు. అఖీరా అమ్మ కూచీనా లేక నాన్న కూచీనా? అన్నది మాత్రం రేణూ నే చెప్పాల్సి ఉందింకా.
Please Read Disclaimer