ఇబిజలో అక్కినేని ఫ్యామిలీ పార్టీ చూశారా

0

కింగ్ నాగార్జున 60వ బర్త్ డే వేడుకలు స్పెయిన్ – ఇబిజ లొకేషన్ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అక్కినేని నాగచైతన్య – సమంత దంపతులు వారం ముందుగానే ఎగ్జోటిక్ లొకేషన్ ఇబిజకు చేరుకుని అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. పనిలో పనిగా వెకేషన్ మూవ్ మెంట్ ని ఆస్వాధిస్తూ అక్కడి నుంచి లైవ్ ఫోటోల్ని సమంత అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశారు. అయితే 29 ఆగస్టు నాగార్జున బర్త్ డే సందర్భంగా 28 ఆగస్టు రాత్రి ఇబిజలోని ఖరీదైన బీచ్ రెస్టారెంట్ లో అదిరిపోయే పార్టీ ఉంటుందని ప్రచారమైంది. ఆ పార్టీకి సంబంధించిన ఏ ఫోటోని సామ్ షేర్ చేయకపోవడంతో అభిమానులంతా కంగారు పడ్డారు.

అసలేమైంది? కింగ్ ఆరోగ్యం బాలేదా.. అన్న చర్చా సాగింది. అయితే అన్నిటికీ చెక్ పెట్టేస్తూ నాగార్జుననే స్వయంగా తన ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదని అభిమానులకు వాట్సాప్ సందేశం పంపారు. అయితే నిన్నంతా కింగ్ సెలబ్రేషన్ ఎలా ఉంది అన్నది చూపించే ఫోటో అయితే రివీల్ కాలేదు. సమంత ఇన్ స్టాలో ఇబిజ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూడాలనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కి తెర వీడింది. కింగ్ నాగార్జునతో కలిసి కుటుంబ సమేతంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఫోటోల్ని సమంత రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అక్కినేని అభిమానుల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి.

వీటిలో నాగార్జున- అమల దంపతులు.. నాగచైతన్య- సమంత జోడీ.. అఖిల్ కలిసి ఉన్న గ్రూప్ ఫోటో ఆకట్టుకుంది. వేరొక ఫోటోలో కింగ్ నాగార్జున స్మిమ్మింగ్ పూల్ లో చిరునవ్వులు చిందిస్తూ కండల ప్రదర్శన చేస్తున్న స్టిల్ అభిమానుల్ని మురిపిస్తోంది. జ్వరం తగ్గింది.. నేను ఆరోగ్యంగానే ఉన్నా! అంటూ కింగ్ ఇచ్చిన రిప్లయ్ ఇదని భావించవచ్చు. మొత్తానికి ఇబిజ లో అక్కినేని ఫ్యామిలీ చిలౌట్ పార్టీ ఓ లెవల్లో సాగిందని అర్థమవుతోంది. అన్నట్టు ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో కింగ్ షష్ఠిపూర్తి పార్టీ హైదరాబాద్ లో ఉంటుందా లేదా? అన్నది అక్కినేనీస్ చెప్పాల్సి ఉంటుంది.
Please Read Disclaimer