నిరాశలో ఫ్యాన్స్.. బంగార్రాజు ఎక్కడ?

0

‘మన్మధుడు 2’ చిత్రం నిరాశ పర్చడంతో వెంటనే ‘బంగార్రాజు’ చిత్రాన్ని చేయాలని నాగార్జున భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్ లేదా నవంబర్ లోనే సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా నాగార్జున బర్త్ డే జరుపుకున్నాడు. నాగ్ 60వ బర్త్ డే అంటే షష్టి పూర్తి వేడుక అవ్వడం వల్ల భారీ ఎత్తున వేడుకలు ఉంటాయని అంతా భావించారు.

ఫ్యాన్స్ మీట్ ఉంటుందని.. అలాగే అక్కినేని ఫ్యాన్స్ సమక్షంలో అకినేనేని హీరోలు నాగార్జున పుట్టిన రోజు నిర్వహిస్తారని అనుకున్నారు. కాని అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కనీసం ఫ్యాన్ కు కూడా అందుబాటులో లేకుండా.. ఇండస్ట్రీ వర్గాల వారికి కూడా దూరంగా నాగార్జున కేవలం కుటుంబ సభ్యులతో బర్త్ డే జరుపుకున్నాడు. ఫ్యాన్స్ ను కలవకున్నా పుట్టిన రోజు సందర్బంగా కొత్త సినిమా గురించి ఏదైనా విశేషంను చెప్తారని అంతా ఆశించారు.

బంగార్రాజు చిత్రం అఫిషియల్ ప్రకటన నాగ్ పుట్టిన రోజున ఉంటుందని అంతా భావించారు. కాని అనుకున్నట్లుగా జరగలేదు. కనీసం ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయం బయటకు రాలేదు. 60వ పుట్టిన రోజు అంటే చాలా స్పెషల్ గా భావిస్తారు. కాని నాగార్జున మాత్రం ఎప్పటిలాగే చాలా రొటీన్ గానే తన పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఇంకా ఈ సారి ఫ్యాన్స్ ను అస్సలు ఇన్వాల్వ్ చేయకుండా నాగ్ పుట్టిన రోజు జరిగి పోయింది. ఈ విషయంలో నాగ్ ఫ్యాన్స్ చాలా నిరాశ చెందినట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer