చైతూ కొత్త సినిమా కూడా అదే ఫార్ములా..!

0

నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో మూడు జెనరేషన్స్ కు సంబంధించిన కథలు ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈమద్య కాలంలో టాలీవుడ్ లో పీరియాడిక్ చిత్రాలు ఎక్కువ అయ్యాయి. రంగస్థలం నుండి మొదలుకుని ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఓ డియర్ చిత్రం వరకు పలు పీరియాడిక్ కథలతో తెరకెక్కుతున్నాయి. జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కూడా పీరియాడిక్ నేపథ్యంలోనే అనే విషయం తెల్సిందే. ఇప్పుడు నాగచైతన్య ఇంకా విక్రమ్ కుమార్ ల కాంబోలో తెరకెక్కబోతున్న చిత్ర్రం కూడా అదే జోనర్ లో ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

1980 నేపథ్యంలో ప్రేమ కథను దర్శకుడు విక్రమ్ కుమార్ చాలా విభిన్నంగా ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో చూపించేందుకు సిద్దం అవుతున్నాడట. పీరియాడిక్ లవ్ స్టోరీ కనుక కాస్త ఎక్కువ బడ్జెట్ అవ్వబోతుందని తెలుస్తోంది. నాగచైతన్య గత ఏడాది మంచి సక్సెస్ లను దక్కించుకున్నాడు. కనుక ఈ ఏడాది కూడా మరో రెండు విజయాలు ఆయన ఖాతాలో పడటం ఖాయం అంటూ అక్కినేని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ కరోనా ఏప్రిల్ వరకు పూర్తిగా అదుపులోకి వస్తే అప్పుడు చైతూ కొత్త సినిమాను మే లేదా జూన్ లో ప్రారంభించే అవకాశం ఉందట.
Please Read Disclaimer