అక్కినేని కోడలు మాస్ రెబల్ స్టైల్

0

స్టైల్ ఐకన్ అంటూ కుర్రాళ్లలో చర్చ సాగితేనే ఫాలోయింగ్ సాధ్యం. ఎంత ఊర మాస్ గా కనిపిస్తే అంతగా ఫాలోవర్స్ ఉంటారు. ఈ ఫార్ములాని ఫాలో చేయడంలో సమంత తర్వాతనే. ఎంత క్లాస్ అప్పియరెన్స్ తో కనిపించినా అప్పుడప్పుడు మాస్ అప్పీల్ తో గ్లింప్స్ ఇవ్వడం తనకే చెల్లింది.

అనుష్క-తమన్నా లాంటి టాప్ బ్యూటీస్ కెరీర్ స్పీడ్ తగ్గాక.. సౌత్ లో వున్న మోస్ట్ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే.. అది అక్కినేని కోడలు సమంతనే అని ఠక్కున చెబుతారు. తెలుగు- తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత పెళ్లి తరవాత నుంచి సినిమాల ఎంపిక విషయంలో కొత్త పంథాను అనుసరిస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటోంది. త్వరలో డిజిటల్ ప్రపంచంలోకి ఎంటరవుతున్న సమంత తాజాగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్ లో తళుక్కున మెరిసింది. ఇటీవలే తమిళ రీమేక్ `96` షూటింగ్ ని పూర్తి చేసుకుని `ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతున్న సమంత రెగ్యులర్ గా హైదరాబాద్ టు ముంబై ప్రయాణాల్లో బిజీ అయిపోయారు. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా ఏయిర్ పోర్ట్ లో మాస్ స్టైల్లో దర్శనమిచ్చి షాకిచ్చింది.

బ్లాక్ ఔట్ ఫిట్ పై ముదురు పసుపు రంగు ఊల్ జాకెట్ ధరించి.. తన ఫేవరేట్ హ్యాండ్ బ్యాగ్ తో కనిపించి ఆకట్టుకుంది. ఈ రేంజ్ మాస్ రెబల్ ఎంట్రీని చూసిన కెమెరా కళ్లు వెంటనే ఇలా బంధించేశాయి. మజిలీ- ఓ బేబీ చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకుని తన సత్తా ఏంటో నిరూపించిన సమంత వెబ్ సిరీస్ తో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. రాజ్ అండ్ డీకే ద్వయం ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి మేకింగ్ తో రాబోతున్న ఈ సిరీస్ తో సామ్ ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మునుముందు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో పాటు.. ఓటీటీ వేదికను సొంతంగా ప్లాన్ చేయాలన్న ప్రణాళికల్లోనూ సమంత ఉంది. అందుకోసం చైతన్యతో కలిసి సొంతంగా ఓ బ్యానర్ ని కూడా ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer