భాగమతి రీమేక్.. అనుష్క పాత్రలో ఎవరు?

0

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ `కబీర్ సింగ్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో సందీప్ రెడ్డి వంగా పేరు ఉత్తరాదిన మార్మోగిపోయింది. కబీర్ సింగ్ నిర్మాతలతోనే సందీప్ మరో బాలీవుడ్ సినిమాకి సంతకం చేశాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు సందీప్ వంగా బాటలోనే మరో ఇద్దరు తెలుగు దర్శకులు హిందీ పరిశ్రమలో లక్ చెక్ చేసుకోబోతున్నారు. అందులో ఒకరు జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి.. ఇంకొకరు భాగమతి దర్శకుడు అశోక్.

గౌతమ్ తిన్ననూరి ఇప్పటికే `జెర్సీ` హిందీ వెర్షన్ స్క్రిప్టుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. హిందీ నిర్మాతలతో కలిసి టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక భాగమతి హిందీ రీమేక్ స్క్రిప్టు విషయంలోనూ అశోక్ పూర్తి క్లారిటీతో ఉన్నారట. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ రీమేక్ కి దుర్గావతి అనే టైటిల్ ని తాజాగా ఫైనల్ చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ లక్కీ గాళ్ భూమి పెడ్నేకర్ కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. అనుష్క పోషించిన పాత్రను భూమి పోషించనుంది. అక్షయ్ కుమార్ తో కలిసి టీసిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ కథాంశంతో భాగమతి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే మెయిన్ థీమ్ చెడకుండా హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే స్క్రిప్టు పరమైన మార్పులు చేర్పులు చేశారట అశోక్. హన్సికతో వెబ్ సిరీస్ పూర్తవ్వగానే హిందీ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళతారని తెలుస్తోంది. ఎట్టకేలకు హిందీ పరిశ్రమలో ఒక్కొక్కరుగా లక్ చెక్ చేసుకోబోతున్నారు. టాలీవుడ్ నుంచి వరుసగా దర్శకులు హిందీ పరిశ్రమలో రాణించే ప్రయత్నం చేయడం ఆసక్తి రేకెత్తించే పరిణామమే.
Please Read Disclaimer