పీవీ సింధు కోచ్ గా అక్షయ్?

0

బ్యాండ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు ఫైనల్ లో జపాన్ కు చెందిన నోజోమి ఒకుహారాను ఓడించి చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాడ్మింటన్ అభిమానులు ఆమె విజయానికి సెల్యూట్ కొడుతున్నారు. తెలుగు వారంతా గర్వించే ఎన్నో విజయాలను దక్కించుకున్న పీవీ సింధు మరో చరిత్రను సృష్టించింది. ఇలాంటి సమయంలో పీవీ సింధు బయోపిక్ గురించిన చర్చ మళ్లీ మొదలైంది.

ఇప్పటికే పీవీ సింధు బయోపిక్ సెట్స్ పై ఉంది. సింధు పాత్రను బాలీవుడ్ స్టార్ శ్రద్దా కపూర్ చేస్తుండగా కోచ్ గోపీచంద్ పుల్లెల పాత్రను సోనూసూద్ పోషిస్తున్న విషయం తెల్సిందే. ఏవో కారణాల వల్ల సింధు బయోపిక్ నత్త నడకన సాగుతోంది. ఈ సమయంలోనే ఆమె మరో బపిక్ గురించిన చర్చ తెరపైకి వచ్చింది. తాజాగా సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. అక్షయ్ కుమార్ అంటే నాకు చాలా ఇష్టం. సింధు బయోపిక్ లో నా పాత్రను ఆయన చేస్తే బాగుంటుందని గోపీచంద్ అభిప్రాయ పడ్డాడు.

సింధు అంటే అక్షయ్ కుమార్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆమె ప్రతి విజయాన్ని అక్షయ్ అభినందిస్తూ వస్తున్నాడు. పలు సందర్బాల్లో అక్షయ్ మరియు సింధులు కలిశారు. ఆమెను అక్షయ్ అనేక సందర్బాల్లో ప్రోత్సహించడం జరిగింది. అందుకే ఆయన సింధు బయోపిక్ లో కోచ్ గా నా పాత్రను పోషిస్తే చూడాలని ఉందంటూ గోపీచంద్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. మరి అక్షయ్ కుమార్ ఈ ప్రపోజల్ కు ఎలా స్పందిస్తాడో చూడాలి.
Please Read Disclaimer