మొత్తం 3 వేల కోట్లు.. ఆ హీరోవి 700 కోట్లు

0

2019 సంవత్సరం గడచి పోయింది. 2020 సంవత్సరం ఆరంభం అయ్యింది. గత సంవత్సరం ఎన్నో జ్ఞాపకాలను రికార్డులను మిగిల్చి పోయింది. పలు రికార్డులతో పాటు కొన్ని చెత్త రికార్డులు కూడా 2019లో నమోదు అయ్యాయి. బాలీవుడ్ కు 2019 సంవత్సరంకు గాను కాస్త నిరాశే అని చెప్పుకోవాలి. గత ఏడాది టాప్ కలెక్షన్స్ చూస్తే హాలీవుడ్ మూవీ ఎండ్ గేమ్ ఇండియాలో ఎక్కువగా వసూళ్లు చేసింది. రెండవ స్థానంలో వార్ చిత్రం నిలిచింది.

ఇక 2019లో బాలీవుడ్ పెద్ద సినిమాలు దాదాపుగా 3 వేల కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి. కొన్ని చిన్న సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్ లో చేరాయి. అయితే ఈ మూడు వేల కోట్ల వసూళ్లలో అక్షయ్ కుమార్ నటించిన నాలుగు సినిమాల కలెక్షన్స్ 700 కోట్లు ఉన్నాయి. గత ఏడాది అక్షయ్ కుమార్ నటించిన నాలుగు సినిమాలు విడుదలై అన్ని సినిమాలు కూడా భారీ వసూళ్లను నమోదు చేశాయి. కేసరితో మొదలుకుని మిషన్ మంగళ్.. హౌస్ ఫుల్ 4 మొన్న విడుదలైన గుడ్ న్యూస్ వరకు అన్ని కలిపి 700 కోట్లకు పైగానే వసూళ్లు చేశాయి. ఒక్క హీరో ఒకే సంవత్సరంలో ఇంత భారీగా వసూళ్లు చేయడం అంటే మామూలు విషయం కాదు.

గతంలో దంగల్ చిత్రంతో అమీర్ ఖాన్ దాదాపుగా రెండువేల కోట్ల రూపాయలను వసూళ్లు చేశాడు. ఇప్పుడు 2019లో అక్షయ్ కుమార్ 700 కోట్ల వసూళ్ల ను దక్కించుకున్నాడు. బాలీవుడ్ సాధించిన మొత్తం లో పావు వంతు కేవలం అక్షయ్ కుమార్ రాబట్టాడు. అందుకే అక్షయ్ కుమార్ పోర్బ్స్ జాబితాలో టాప్ లో ఉన్న విషయం తెల్సిందే. వరుసగా చిత్రాలు చేస్తున్న కారణంగా అక్షయ్ కుమార్ కు ఈ రికార్డు సాధ్యం అయ్యింది. 2020లో కూడా అక్షయ్ నటించిన మూడు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఈసారి వెయ్యి కోట్ల వరకు సాధిస్తాయేమో చూడాలి.
Please Read Disclaimer