చీరలో తనకు కంఫుర్ట్ గానే ఉందన్న స్టార్ హీరో!

0

ఇది వరకూ చాలా మంది స్టార్ హీరోలు మహిళ వేషాల్లో మెప్పించారు. కమల్ హాసన్ నరేష్ రాజేంద్రప్రసాద్ వంటి సౌత్ హీరోలు చీర కట్టి సింగారించుకున్నారు. మహిళల వేషాల్లో వారు రాణించారు. అయితే ఇప్పుడు కొంతమంది నటులు మరో అడుగు ముందుకు వేసి ట్రాన్స్ జెండర్ పాత్రలనూ చేస్తున్నారు. సౌత్ లో శరత్ కుమార్ సాయికుమార్ లారెన్స్ లు ఒకే సినిమా విషయంలో ట్రాన్స్ జెండర్ లుగా నటించారు. చీరకట్టులో కనిపించారు.

ఇప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ వంతు వచ్చింది. కాంచన సినిమా రీమేక్ లో అక్షయ్ ట్రాన్స్ జెండర్ గా నటిస్తూ ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే లుక్స్ విడుదల అయ్యాయి. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ను రూపొందించిన లారెన్స్ హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తూ ఉన్నాడు. మొదట ఈ సినిమాకు సంబంధించి ఒక వివాదంతో లారెన్స్ బయటకు వచ్చేసినట్టుగా ప్రకటించాడు. ఆ తర్వాత ఇరు వర్గాలూ రాజీ చేసుకున్నాయి.

లక్ష్మీబాంబ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అక్షయ్ కుమార్ తన అనుభవాలను పంచుకున్నాడు. ప్రత్యేకించి చీరకట్టులో నటించడం గురించి చెప్పాడు. చీర తనకు చాలా కంఫర్ట్ గా అనిపించిందని అక్షయ్ చెబుతున్నాడు. తొలి సారి చీరకట్టులో నటించినా తనకు ఏ ఇబ్బందీ కలగలేదని అన్నాడు. చీరకట్టును తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది పురుషాంహాకారం. చీరకట్టిన అమ్మాయిని ఇష్టపడతారు కానీ చీరకట్టును మాత్రం తక్కువే చేసి మాట్లాడతారు మగాళ్లు. ఇప్పుడు ఒక స్టార్ హీరో చీరలో తన అనుభవాన్ని వివరించాడు. చీర చాలా కంఫర్ట్ అంటున్నాడు!
Please Read Disclaimer