ఫోర్బ్స్ 2019 టాప్ 10 జాబితాలో కిలాడీ

0

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నుల జాబితాల్ని రూపొందించడం ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ పని. ప్రతియేటా ఏ రంగంలో ఎవరు ఎంత సంపాదిస్తున్నారు? అన్నది ఆరా తీస్తూ జాబితాలు రూపొందిస్తుంది. తాజాగా 2018-19 సీజన్ కి టాప్ 10 సంపాదకులైన సెలబ్రిటీల జాబితాని ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో భారతదేశం నుంచి వరల్డ్ టాప్ 4 సంపాదకుడిగా కిలాడీ అక్షయ్ కుమార్ పేరు నిలిచింది. ఏడాదికి 65 మిలియన్ డాలర్ల సంపాదన కలిగిన స్టార్ గా అతడి పేరును జాబితాలో చేర్చింది.

ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ దాదాపు 89.4 మిలియన్ డాలర్ల ఆర్జనతో నంబర్ 1గా నిలవగా .. ఆ తర్వాత 76.4 మిలియన్ డాలర్ల సంపాదనతో టాప్ 2 స్థానంలో అవెంజర్స్ ఫేం క్రిస్ హేమ్స్ వర్త్ నిలిచారు. అవెంజర్స్ స్టార్ రోబర్ట్ డౌనీ జూనియర్ 66 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలవగా 65 మిలియన్ డాలర్లతో కిలాడీ అక్షయ్ నాలుగో స్థానంలో నిలిచారు. 58 మిలియన్ డాలర్ల సంపాదనతో ఐదో స్థానంలో జాకీచాన్ .. 57 మిలియన్ డాలర్ల ఆర్జనతో బ్రాడ్లీ కూపర్ – ఆడమ్ సాండ్లర్ ఆరో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 43.5 మిలియన్ డాలర్లతో క్రిస్ ఇవాన్స్.. 41 మిలియన్ డాలర్లతో పాల్ రుడ్ టాప్ 10 లో చోటు సంపాదించుకున్నారు. ఇక ఈ జాబితాలో ఒకప్పటి నంబర్ వన్ సంపాదకుడు విల్ స్మిత్ 35 మిలియన్ డాలర్ల వార్షికాదాయంతో టాప్ 10 స్థానంలో నిలిచారు.

ఇక కిలాడీ అక్షయ్ వార్షికాదాయం వివరాలు పరిశీలిస్తే.. 2018-19 సీజన్ లో అతడు సినిమాలు- వాణిజ్య ప్రకటనల ద్వారా 65 మిలియన్ డాలర్లు సంపాదించాడు. ఈ సీజన్ లోనే అక్కీ నటించిన 2.0 – గోల్డ్- కేసరి చిత్రాలు రిలీజయ్యాయి. ఇవన్నీ బ్లాక్ బస్టర్లు సాధించాయి. ఇటీవలే రిలీజైన `మిషన్ మంగళ్` ఘనవిజయం సాధించింది. ఒక్కో సినిమాకి 5-10 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకునే అక్షయ్ కుమార్ వాణిజ్య ప్రకటనల రూపంలోనూ భారీగా ఆర్జిస్తున్నారు. ఈ ఒక్క సీజన్ లో 20 బ్రాండ్లు అతడి ఖాతాలో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. రకరకాల ఆదాయ మార్గాల్ని కలుపుకుని అక్షయ్ సంవత్సరానికి 65 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడని ఫోర్బ్స్ గణాంకం వెల్లడించింది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home