సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

‘జగన్’ కు బాలీవుడ్ హీరో ఆర్థిక సాయం

0

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తనలోని మరో కోణాన్ని బయట పెట్టారు. తాను పని చేసిన దర్శకుడికి కష్టమొస్తే.. పరామర్శించటానికి సైతం వెనుకాడే సినిమా ఇండస్ట్రీ లో.. అందుకు భిన్నంగా లక్షలాది రూపాయిలు ఖర్చు చేసేందుకు వెనుకాడకుండా ముందుకొచ్చిన వైనం తెలిస్తే అభినందించకుండా ఉండలేం. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ ఆ మధ్యన జగన్ శక్తి అనే దర్శకుడి తో మిషన్ మంగళ అనే మూవీ చేశారు. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇస్రో చేసిన మంగళయాన్ ను స్ఫూర్తిగా చేసుకొని నిర్మించిన ఈ చిత్రంతో జగన్ శక్తి టాలెంట్ ఇండస్ట్రీకి అర్థమైంది. ఇదిలా ఉంటే.. సదరు దర్శకుడి ఒక వేడుకలో పాల్గొన్న సందర్భంగా తీవ్ర అస్వస్థత కు గురయ్యాడు. అనూహ్యంగా ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టటంతో ఆయన హెల్త్ కండీషన్ సీరియస్ గా మారింది.

ఈ విషయం తెలుసుకున్న అక్షయ్ కుమార్ స్పందించి.. జగన్ చికిత్స కు అవుతున్న ఖర్చును భరించేందుకు ముందుకొచ్చాడు. అంతేకాదు.. సదరు దర్శకుడి కుటుంబంతో నిత్యం అందుబాటులో ఉంటూ వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటున్న వైనం బయటకు వచ్చింది. అందుకోసం తన సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలుస్తోంది. జగన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఏమైనా సినిమా చేసిన తర్వాత.. అక్కడితో రిలేషన్ బంద్ అయినట్లుగా వ్యవహరించే సినిమా ఇండస్ట్రీలో తాను పని చేసిన దర్శకుడు తీవ్ర అస్వస్థతకు గురైతే.. అక్షయ్ స్పందించిన తీరును పలువురు అభినందిస్తున్నారు. ఇలాంటివి ఇండస్ట్రీలో చాలా తక్కువన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.
Please Read Disclaimer