సౌత్ స్టార్ నార్త్ స్టార్ మధ్య నలిగిందే

0

నారీ నారీ నడుమ మురారి! ఇద్దరు నారీమణుల నడుమ నలిగిపోయే మురారి కథ. కానీ ఇక్కడ సీన్ వేరేగా ఉంది. నరుడు నరుడు మధ్య నలిగిపోయే నారీమణి కథ ఇది అనుకోవచ్చేమో. అటు సౌత్ స్టార్ ఇటు నార్త్ స్టార్ టీనేజీ అమ్మాయిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. అటూ ఇటూ ఉండి ఘాటైన ముద్దులతో బంధించేశారు. అసలింతకీ ఏమిటీ వైపరీత్యం? అంటారా? అక్కడే ఉంది లాజిక్కు.

ఏదో ఒక లాజిక్కు.. జిమ్మిక్కు లేకుండా నిండా పాతికైనా నిండని అమ్మాయితో ఇలా 50 ప్లస్ హీరో.. ఫిఫ్టీకి దగ్గరవుతున్న హీరో ఇంత ఘాటైన రొమాన్స్ చేయరు కదా? బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ – సౌత్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రల్లో .. యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ కథానాయికగా కొత్త సినిమా మొదలైంది.

జీరో లాంటి ఫ్లాప్ తర్వాత ఆనంద్ ఎల్.రాయ్ ఈసారి లవ్ స్టోరీతో సెట్స్ పైకి వెళుతున్నారు. `అట్రాంగి రే` అనేది ఈ సినిమా టైటిల్. 2020 మార్చిలో చిత్రీకరణను ప్రారంభించి 2021 ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో ధనుష్ – సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. అయితే ఆ ఇద్దరి మధ్యలో అక్షయ్ ఎందుకు? అన్నదే అసలు సస్పెన్స్. కిలాడీని ఇందులో పూర్తి స్థాయి పాత్రలో చూపిస్తున్నారా? లేక అతిధిగా మాత్రమే పరిమితం చేశారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక రాంజానా స్టార్ గా ధనుష్ కి బాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే మధ్యలో తమిళ సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు బాలీవుడ్ ని టచ్ చేస్తున్నాడు. 2013లో తనని హిందీ చిత్ర సీమకు పరిచయం చేసిన ఆనంద్.ఎల్.రాయ్ దర్శకత్వం లోనే ధనుష్ మరోసారి తాజా చిత్రానికి అంగీకరించారు.

ఇక తన కెరీర్ ప్రారంభ దశలో ఉన్నా.. సారా అలీ ఖాన్ టాప్ స్టార్ల సరసన నటించేస్తోంది. ఒక రకంగా ఇతర నాయికలతో పోలిస్తే సారా లక్కీ గాళ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన `లవ్ ఆజ్ కల్ 2` విడుదలకు సిద్ధమవుతుండగా.. సారా ప్రమోషన్స్ తో వేడెక్కిస్తోంది. ఈలోగానే ఆనంద్ రాయ్ దర్శకత్వం లో లక్కీగా ఛాన్స్ కొట్టేసింది.
Please Read Disclaimer