స్టార్స్ కు ఆదర్శంగా నిలుస్తున్న 100 కోట్ల హీరో

0

బాలీవుడ్ లో ఈమద్య కాలంలో వంద కోట్ల సినిమాలు చాలా ఎక్కువ అయ్యాయి. అయితే స్టార్ హీరోలు అందరు కూడా వరుస పెట్టి వంద కోట్ల సినిమాలను మాత్రం చేయలేక పోతున్నారు. అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి వారు మాత్రమే వంద కోట్ల సినిమాలను వరుసగా చేస్తున్నారు. వంద కోట్ల రూపాయల సినిమాలు వరుసగా చేస్తున్న హీరోల జాబితాలో అక్షయ్ కుమార్ చేరాడు. గత కొన్ని సంవత్సరాలుగా తన ప్రతి సినిమాతో వంద కోట్ల రూపాయలను వసూళ్లు చేస్తున్న అక్షయ్ కుమార్ తన తాజా చిత్రం ‘కేసరి’తో కూడా సునాయాసంగా వంద కోట్లను రాబట్టాడు.

అఫ్గానిస్తాన్ సైనికులకు సిక్కులకు మద్య జరిగిన పోరాటంకు సంబంధించిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను తీసుకుని దర్శకుడు అనురాగ్ సింగ్ రూపొందించిన చిత్రం ‘కేసరి’. విడుదలకు ముందే ఈ చిత్రంపై అంచనాలు భారీగా వచ్చాయి. అక్షయ్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ చిత్రం మొదటి రోజే పాతిక కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. ఆ తర్వాత అయిదు రోజుల్లో 75 కోట్లు రాబట్టి మొత్తంగా ఆరు రోజుల్లోనే 100 కోట్ల రూపాయలను రాబట్టింది. రికార్డు స్థాయి వసూళ్లు దక్కించుకుంటూ ఈ చిత్రం దూసుకు పోతుంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 200 కోట్ల ను రాబట్టడం ఖాయంగా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

చేసిన ప్రతి సినిమాతో కూడా వంద కోట్లు రాబడుతున్న అక్షయ్ కుమార్ స్టార్ గా దూసుకు పోతున్నాడు. సంవత్సరంలో కనీసం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అక్షయ్ కుమార్ చేసిన ప్రతి సినిమా కూడా వంద కోట్లు వసూళ్లు చేసేలా చేస్తున్నాడు. సినిమాలు చేయడంలో వేగం కనబర్చడంతో పాటు అదే సమయంలో క్వాలిటీ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఇతర హీరోలకు ఆక్షయ్ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Please Read Disclaimer