నీలాగా ఎవ్వరూ చెయ్యలేరు.. నీకో దణ్ణం రాజా!

0

బాలీవుడ్ లో చాలామందే స్టార్లు ఉన్నారు కానీ వారిలో ఖిలాడిగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ కాస్త డిఫరెంట్. మొదట్లో జస్ట్ యాక్షన్ సినిమాల హీరోగానే పేరు పడినప్పటికీ గత కొన్నేళ్ళుగా తన ఇమేజ్ ని పూర్తిగా మార్చుకున్నాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. పేరుకి స్టార్ హీరో అయినా అక్షయ్ ఏమాత్రం స్టార్ డమ్ ను పట్టించుకునే రకం కాదు. సినిమాలోని పాత్ర డిమాండ్ మేరకు ఎలాగైనా నటిస్తాడు.

‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’ రిలీజుకు ముందు ఎక్కువ మంది “అక్షయ్ ఇలాంటి సినిమా చేస్తున్నాడేంటి?” అనుకున్నారు. ‘ప్యాడ్ మాన్’ చేసిన సమయంలో కూడా అలాంటి కామెంట్లే వినినిపించాయి. ఇదిలా ఉంటే అక్షయ్ తాజా చిత్రంలో ఒక సీన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హౌస్ ఫుల్ ఫ్రాంచైజీలో నాలుగవ చిత్రం ‘హౌస్ ఫుల్ 4’ ఈ నెలలోనే రిలీజ్ అవుతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమానుండి ‘ఏక్ చుమ్మా’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ను కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్.. బాబీ డియోల్.. రితీష్ దేశ్ ముఖ్..పూజా హెగ్డే.. కృతి సనన్.. కృతి కర్బందా అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుంటారు. ఈ పాటలో ఒక సందర్భంలో అక్షయ్ నేలమీద కూర్చుని పూజ హెగ్డే పాదాలకు ముద్దు పెడతాడు. రెండు మూడు ముద్దులు పెడుతూనే ఉంటాడు. అప్పుడు పూజ తన కాలితో అక్షయ్ ఫేసును పైకి లేపుతుంది.. నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ అవుతుంది.

హీరోయిన్ల చేత ఇలాంటి సీన్లు చేయిస్తే హాయిగా నటించే హీరోలు చాలామందే ఉన్నారు కానీ ఇలా ఇమేజ్ ని ఏమాత్రం పట్టించుకోకుండా అక్షయ్ లాగా నటించే స్టార్ హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అందుకే ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కొందరేమో ఇది డైరెక్టర్ చెత్త టేస్ట్ ను సూచిస్తోంది అని తిట్టిపోస్తుంటే.. కొందరేమో అక్షయ్ ని మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా ఈ సినిమాకు ఈ సీను మరింతగా పబ్లిసిటీ తెచ్చిపెట్టింది.
Please Read Disclaimer