మిషన్ మంగల్

0

బాలీవుడ్ లో విభిన్న చిత్రాలు రావని..సౌత్ సినిమాలను చూసి నేర్చుకోవాలని కొందరు విమర్శిస్తుంటారు గానీ ఆ వాదనలో పూర్తిగా నిజం లేదు. అమీర్ ఖాన్.. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ హీరోల సినిమాలే అందుకు ఉదాహరణ. అమీర్ సంగతి మనకు తెలిసిందే. అక్షయ్ కుమార్ విషయానికి వస్తే అయన చేసిన లాస్ట్ 10 సినిమాల్లో 8 డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రయోగాత్మకంగా చేసినవే.

‘బేబీ’.. ‘ఎయిర్ లిఫ్ట్’.. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’.. ‘రుస్తోం’.. ‘ప్యాడ్ మ్యాన్’..’గోల్డ్’.. ఇలా సాగుతుంది లిస్టు. అప్పుడప్పుడు గ్యాప్ లో మాస్ ఫ్యాన్స్ కోసం ‘హౌస్ ఫుల్’ లాంటి మసాలా ఫిలిమ్స్ కూడా చేస్తాడు. ఇక తాజాగా అక్షయ్ కుమార్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘మిషన్ మంగల్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అక్షయ్ ఒక కీలక పాత్ర పోషిస్తాడట. ఈ సినిమా ఇస్రో చేప్పట్టిన మార్స్ మిషన్ ‘మంగళయాన్’ నేపథ్యంలో తెరకెక్కనుంది.

ఈ సినిమా స్టార్ క్యాస్ట్ భారీగానే ఉంది. సోనాక్షి సిన్హా.. విద్యా బాలన్.. తాప్సీ పన్ను.. కీర్తి కుల్హారి.. శర్మాన్ జోషి లు ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్. ఇక మలయాళం బ్యూటీ నిత్య మీనన్ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఐదేళ్ళ క్రితం మంగళయాన్ మిషన్ లాంచ్ చేసిన నవంబర్ 5 వ తేదీ.. ఈ సినిమాను లాంచ్ చేసిన తేదీ(నవంబర్ 5) ఒకటే కావడం విశేషం.
Please Read Disclaimer