జియో : షారుఖ్ స్థానంలో అక్షయ్ ?

0

ప్రస్తుతం సోషల్ మీడియా అంటేనే భయం తో వణికి పోవాల్సి వస్తుంది. అసలు ఇది నిజమైన వార్తనో ..ఇది అబద్దపు వార్తనో తెలుసుకోవడానికే సమయం సరిపోవడం లేదు. ఈ మధ్య మరీ పేక్ వార్తలకి హద్దు అదుపు లేకుండా పోయింది. తాజాగా జియో సిమ్ ప్రకటనల నుంచి షారుఖ్ ఖాన్ ను ముకేశ్ అంబాని తొలగించారని ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అయింది.

“జియో సిమ్ యాడ్ నుంచి షారుఖ్ ఖాన్ ను తొలగించాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి’’… ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ ట్విటర్లో తన ‘ఫాలోవర్ల’ను సలహాలు అడిగారు. ఇందుకు వారి నుంచి స్పందన కూడా బాగానే వచ్చింది. పదివేల సార్లు ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. 50 వేలకు పైగా లైకులు కొట్టారు. అంతేకాదు బాలీవుడ్ ఖాన్లకు సరైన రీతిలో బుద్ధి చెప్పారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.

వీరిలో ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గో స్వామి ప్రఖ్యాత గాయకుడు సోనూ నిగమ్ కూడా ఉండటం విశేషం. అర్నబ్ అయితే ఓ అడుగు ముందుకేసి.. జియో సిమ్ యాడ్‌లో షారుఖ్‌ను తొలగించి ఆ స్థానంలో అక్షయ్ కుమార్ ను తీసుకున్నారు. ఈ ఖాన్‌లను బాయ్‌కాట్ చేయాల్సిందే అని హ్యాష్ ట్యాగ్ కూడా జోడించారు. అయితే ఆ తర్వాత అసలు విషయం బయట పడింది. అసలు ముకేశ్ అంబానీకి ట్విటర్ ఖాతానే లేదు. ఇదంతా ఫేక్ అని అప్పుడు అర్థం చేసుకున్నారు.

ముకేశ్ అంబానీతో పాటు అర్నబ్ గోస్వామి సోనూల అకౌంట్లు కూడా నకిలీవే అని తెలుసుకుని షాక్ అయ్యారు. ఇక ఇట్లాంటి ఫేక్ న్యూస్ లు వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టే అసత్య కథనాలకు కొదవే లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఈ ఫేక్ న్యూస్ బురద వల్ల మనం ఒక్కోసారి చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.
Please Read Disclaimer