ఆ గాసిప్ ను నిజం చేసిన అక్షయ్.. రోహిత్!

0

సినిమా న్యూస్ అన్న తర్వాత గాసిప్స్ సహజమే. మరీ వ్యక్తిగత జీవితాన్ని కించ పరిచేవి.. సినిమా గురించి నెగెటివ్ గా ఉండేవి తప్ప మిగతా గాసిప్స్ అన్నీ సరదాగా ఉంటాయి. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో ఈ గాసిప్స్ గోల చాలా ఎక్కువ. ఒక్కోసారి ఫిలిం మేకర్స్ ప్రచారం కోసమే హీరో హీరోయిన్ల ఎఫైర్ గాసిప్స్ పుట్టిస్తారనే అపవాదు కూడా ఉంది. ఈ సోది ఇంట్రో ఆపి డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తే ఈమధ్య ‘సూర్యవంశి’ టీం పై ఒక గాసిప్ వచ్చింది.. దానికి ఫిలిం యూనిట్ నుంచి భారీ కౌంటర్ కూడా వచ్చింది.

బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి ప్రస్తుతం అక్షయ్ కుమార్ .. కత్రినా కైఫ్ తో ‘సూర్యవంశి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ ఈ సినిమా గురించి ఒక వార్త రాసింది. అక్షయ్ కుమార్.. రోహిత్ శెట్టి మధ్య గొడవ జరిగిందని.. ఇద్దరూ ఎడమొహం పెడమొహం గా ఉంటే నిర్మాత కరణ్ జోహార్ మధ్య వర్తిత్వం వహించి సర్దుబాటు చేశారనేది సదరు వార్త సారాంశం. దీంతో ‘సూర్యవంశి’ టీమ్ చిరాకు పడ్డారేమో కానీ ఒక వీడియో షూట్ చేశారు. ఆ వీడియోను అక్షయ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి “#బ్రేకింగ్ న్యూస్- ఈ గొడవ మీ రోజు ను సరదా గా మారుస్తుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వీడియో లో మొదట కత్రినా తన ఫోన్ లో ఆ గాసిప్ ను చూపిస్తుంది. ఆ తర్వాత అక్షయ్.. రోహిత్ ఇద్దరూ ఒకరిపై ఒకరు కోపం తో పిడి గుద్దులు కురిపించుకుంటారు. అప్పుడు ముంబై పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇద్దరి నీ పక్క కు లాగుతారు. ఇక ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే సదరు ఆర్టికల్ లో ‘ఫాలౌట్’ అనే ఇంగ్లీష్ పదాన్ని వాడారు… దానికి కూడా కౌంటర్ అన్నట్టుగా అక్షయ్.. రోహిత్ ఫైట్ లో భాగంగా నేల మీద పడిపోవడం. ఈ వీడియోకు బాలీవుడ్ సెలబ్రిటీ ల నుంచి అద్భుత స్పందన దక్కుతోంది. వరుణ్ ధావన్.. కృతి సనన్.. టైగర్ ష్రాఫ్.. పూజా హెగ్డే లైక్స్ కొట్టి కామెంట్స్ పెట్టారు. జస్ట్ వన్ అవర్ లోనే లక్ష లైక్స్ వచ్చాయి. మీరు ఒక లుక్ వెయ్యండి.
Please Read Disclaimer