ట్రోలర్ కు షాక్ ఇచ్చిన అఖ్తర్ గర్ల్ ఫ్రెండ్!

0

సోషల్ మీడియా అన్న తర్వాత ట్రోలింగ్ చాలా కామన్. సెలబ్రిటీలకు ఈ బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే అధికశాతం సెలబ్రిటీలు ఈ ట్రోలింగ్ అంశాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా రిప్లై ఇస్తారు. రీసెంట్ గా ఫర్హాన్ అఖ్తర్ హాట్ గర్ల్ ఫ్రెండ్ షిబాని దండేకర్ అలానే చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే రీసెంట్ గా షిబాని తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మాట్లాడుతూ.. బాడీపై ఉండే హెయిర్ క్లీన్(షేవ్) చేసుకోకుండా న్యాచురల్ గా ఉండాలనేచర్చ జరుగుతోందని.. దానిపై తన అభిప్రాయాన్ని వినిపించింది. హీరో కార్తిక్ ఆర్యన్ మొదలు పెట్టిన బాడీ హెయిర్.. బాడీ బేర్ హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉందని తనవరకూ వస్తే ‘క్లీన్ గా ఉన్నంతవరకూ హెయిర్ ఉన్నా ఒకే అని.. అయితే బీచ్ కు వెళ్ళడం లాంటి కొన్ని సందర్భాల్లో మాత్రం హెయిర్ లేకపోతే బాగుంటుందని’ అభిప్రాయం పడింది. దీనిపై మీరేమంటారు? అని నెటిజన్ల అభిప్రాయాలు కోరింది.

దీనికి స్పందనలు చాలానే వచ్చాయి కానీ ఒకరు మాత్రం “జస్ట్ ఫ.. ఒక్కసారి ఇండియన్ యాక్సెంట్ లో మాట్లాడు” అని ఘాటుగా విమర్శించాడు. వీడియోలో షిబాని హైఫై గా అమెరికన్ యాసలో మాట్లాడడం సదరు వ్యక్తికి నచ్చలేదేమో మరి.. అందుకే తన నోటిదూలను కామెంట్ రూపంలో తీర్చుకున్నాడు. అయితే షిబానికి చిర్రెత్తుకొచ్చి “ఒక్కసారి జస్ట్ ఫ.. అప్” అంటూ సమాధానం ఇచ్చింది. కొందరు నెటిజన్లు షిబానికి మద్దతుగా కామెంట్లు పెట్టారు. దీంతో ఆ ట్రోలర్ “నన్ను క్షమించండి” అని రిప్లై ఇచ్చాడు. ఒకటి మాత్రం నిజం.. షిబాని హాట్ మాత్రమే కాదు.. ఘాటు కూడా!
Please Read Disclaimer