హీరోయిన్ రకుల్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తల్లి!

0

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ఇటూ తెలుగు సినిమాలు చేస్తూనే అటూ హిందీ తమిళ సినిమాల్లోను బిజీ అవుతోంది. తెలుగు తెరకు ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’తో మొదటి హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత నుండి తన అందచందాలతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొడుతోంది. అందులో భాగంగా ‘లౌక్యం’ ‘నాన్నకు ప్రేమతో’ ‘ధృవ’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ‘పండగ చేస్కో’ లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మధ్య రకుల్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గి వెనకబడింది. రకుల్ చివరిగా కనిపించిన సినిమా ‘మన్మధుడు2’ దీంతో అమ్మడు ఇప్పుడు హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది.

ఇక లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటున్న రకుల్.. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తోంది. కుదిరినప్పుడల్లా కొత్త కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తూ.. తమ్ముడితో చిన్ననాటి ఆటలు ఆడుతూ కాలక్షేపం చేస్తోంది. అయితే ఇటీవలే రకుల్ గురించి ఓ ముఖ్యమైన విషయం పై పెదవి విప్పింది. తాజాగా రకుల్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కూతురు రకుల్ ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉంటోంది. ఎంతకాలం చేయాలనీ అనుకుంటుందో చేయనిస్తాం.. తన పెళ్ళికి పెద్దగా తొందరేం లేదు. తను ఎప్పుడు పెళ్ళికి సిద్ధం అవుతుందో.. అప్పుడే తను కోరుకున్న కుర్రాడిని ఇచ్చి పెళ్లి చేస్తాం..’ అంటూ బదులిచ్చింది. ఈ విషయం తెలిసిన రకుల్ ఫ్యాన్స్ ఇప్పట్లో పెళ్లి లేదు అనగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రకుల్ ప్రస్తుతం హిందీ సినిమాలు చేస్తూనే.. కమల్ హాసన్ ‘భారతీయుడు2’ లో నటిస్తోంది.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home