వివాహం ఫిక్స్ అంటున్న డైరెక్టర్

0

రీసెంట్ గా ‘అభినేత్రి 2’ ప్రేక్షకులను పలకరించిన తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ త్వరలో వివాహం చేసుకోనున్నాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివాహం విషయాన్ని ప్రకటిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఏఎల్ విజయ్ గతంలో హీరోయిన్ అమలా పాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం చేసుకున్న రెండేళ్లకే అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నాడు . 2017 లో విడాకులు తీసుకున్న విజయ్ తాజాగా తన రెండో వివాహం గురించి వెల్లడించాడు.

జీవన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనదని.. అందరిలాగానే తన ప్రయాణం కూడా అలాగే సాగిందని అన్నాడు. తన జీవితంలోని వివిధ దశల్లో విజయం.. సంతోషం.. బాధ అన్నీ చూడడం జరిగిందని.. తనకు అన్ని సమయాల్లో మద్దతుగా నిలిచిన అందరికీ.. ప్రత్యేకంగా మీడియాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇప్పుడు తన జీవితంలో మరో కీలకమైన మలుపు చోటుచేసుకోబోతోందని.. డా.ఆర్. ఐశ్వర్యతో తన వివాహం నిశ్చయం అయిందని.. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని వెల్లడించాడు. ఈ జులైలోనే తమ మ్యారేజ్ జరుగుతుందని.. మీ అందరి ప్రేమతో.. ఆశీస్సులతో తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నానని తెలిపాడు.

తమిళంలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో ఏఎల్ విజయ్ ఒకరు. ‘మదరాసిపట్టనం’.. ‘దైవ తిరుమగళ్’ (తెలుగులో ‘నాన్న’) లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాడు.
Please Read Disclaimer