బుట్ట బొమ్మతో స్టైలిష్ బన్నీ

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ‘అల వైకుంఠపురములో’ ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ విషయం లో ముందంజ లో ఉంది. తాజాగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ నుండి ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈమధ్యే రిలీజ్ అయిన ‘బుట్టబొమ్మ’ సాంగ్ సంగీత ప్రియులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పోస్టర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

ఈ పోస్టర్ లో పూజ ఒక మోడరన్ గౌన్ ధరించి బార్బీ బొమ్మ తరహాలో నిలుచుంది. అల్లు అర్జున్ పూజ భుజం మీద తన మోచేతిని ఆన్చి మరో చేతితో అతన బెల్టును పట్టుకుని సూపర్ స్టైలిష్ పోజిచ్చాడు. బన్నీ డ్రెస్ అయితే అదిరిపోయింది. ప్రింటెడ్ డిజైన్ ఉండే తెలుపు రంగు చొక్కా.. క్రీం కలర్ ప్యాంట్ కాంబినేషన్లో టక్ చేసుకొని నిలుచున్నాడు. ప్యాంట్ పొట్టి గా ఉండడం తో కొత్తగా న్యూ స్టైల్ అన్నట్టు గా ఉంది.

ఈ సినిమా నుండి ఇప్పటివరకూ నాలుగు పాటలు విడుదలైతే మూడు సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ‘అల వైకుంఠపురములో’ టీమ్ ఫుల్ జోష్ లో ఉంది. జనవరి 6 వ తారీఖున హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో మ్యూజిక్ కాన్సర్ట్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో థమన్ అల వైకుంఠపురములో పాటలను లైవ్ లో పెర్ఫాం చేస్తారట. ఇది స్టైలిష్ స్టార్ అభిమానులకు ఒక పెద్ద ట్రీట్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
Please Read Disclaimer