అల వైకుంఠపురములో ప్రీరిలీజ్ బిజినెస్

0

సంక్రాంతి పందెంలో నాలుగు సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న రజనీ దర్బార్ .. జనవరి 11న మహేష్ సరిలేరు నీకెవ్వరు.. జనవరి 12న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. జనవరి 15న కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల పేరుతో దాదాపు 300 కోట్ల మేర బెట్టింగ్ నడుస్తోంది. ఆ క్రమంలోనే ఏ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

తాజాగా అల వైకుంఠపురములో ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు అందాయి. ఫిలిం పంపిణీదారుల సమాచారం ప్రకారం.. నైజాం – 20.00 కోట్లు.. సీడెడ్ – 12.06 కోట్లు.. నెల్లూరు – 2.80 కోట్లు.. కృష్ణా – 5.00 కోట్లు.. గుంటూరు – 6.30 కోట్లు.. వైజాగ్ – 8.50 కోట్లు.. ఈస్ట్ – 6.30 కోట్లు..వెస్ట్ – 5.00 కోట్లు.. ప్రీబిజినెస్ జరిగింది. టోటల్ ఏపీ+తెలంగాణ – 65.96 కోట్ల మేర బిజినెస్ చేశారు. కర్ణాటక – 7.20 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా – 1.50 కోట్లు.. ఓవర్సీస్ – 9.80 కోట్లు.. టోటల్ వరల్డ్వైడ్ – 84.46 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది.

దాదాపు 85 కోట్ల మేర బిజినెస్ చేసింది కాబట్టి ఆ మేరకు షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 50కోట్లు పైగా బిజినెస్ సాగిందని అంచనా వేస్తున్నారు. శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్.. హిందీ డబ్బింగ్.. ఆడియో రైట్స్ వగైరా బిజినెస్ అదనం. బన్ని-త్రివిక్రమ్ జోడీ రెండు బ్లాక్ బస్టర్లు అందుకుని ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. ఆ క్రమంలనే బిజినెస్ కి క్రేజ్ ఏర్పడిందని తెలుస్తోంది.
Please Read Disclaimer