కొత్త పోస్టర్: అల.. ఫ్రేమ్ లో పట్టనంత ఫ్యామిలీ

0

ఫ్యామిలీ కంటెంట్ ని తన సినిమాలో మాటల మాయావి త్రివిక్రమ్ ఏ స్థాయిలో చూపించబోతున్నారో ఇదిగో ఈ పోస్టర్ చూస్తే చెబుతోంది. ఇంటిల్లి పాదినీ థియేటర్లకు రప్పించడమే ధ్యేయంగా `అల వైకుంఠపురములో` చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.

ఉమ్మడి కుటుంబాలు మాయమైపోయిన ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా కలిసి థియేటర్లకు రావాలన్న ఆయన కోరిక నెరవేరుతుందా లేదా? అన్నది అటుంచితే తన సినిమాలో మాత్రం ఉమ్మడి కుటుంబాన్ని చూపిస్తున్నాడనే అర్థమవుతోంది. ఒకే కుటుంబంలో అక్కలు చెల్లెళ్లు.. బాబాయ్ లు.. అమ్మమ్మలు.. నాయనమ్మలు.. ఆడపడుచులు.. బావలు.. మరదళ్లు .. ఇంటి పెద్దదిక్కు .. ఇలా కనిపిస్తే ఆ లుక్కే వేరు.

ఈ ఫోటో చూస్తుంటే అంతే ఆహ్లాదంగా కనిపిస్తోంది. పక్కా ఫ్యామిలీ బొమ్మనే త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారని అర్థమవుతోంది. అయితే ఇంత నిండుగా ఉండే ఇంట్లో కలతలు వచ్చినా అంతే ఇదిగా ఉంటాయి మరి. అక్కడే అసలు కథ రన్ అవుతుంది. మరి దానిని బన్ని ఎలా డీల్ చేస్తాడు? అన్నది తెరపై చూపిస్తున్నారేమో. ఇప్పటివరకూ రిలీజైన పోస్టర్లలో కొందరు మిస్సయినా.. ఈ దీపావళి పోస్టర్ లో మాత్రం అసలు ఎవరూ మిస్ కాలేదు. అల్లు అర్జున్- పూజా హెగ్డే- సుశాంత్-నవదీప్- సునీల్-నివేద పెతురాజ్- టబు- జయరాం- మురళి శర్మ- సచిన్ ఖేద్కర్- హర్షవర్ధన్ ఇలా అన్ని క్యారెక్టర్లను పోస్టర్ లోకి దించేశారు. అసలు ఇందులో చుట్టరికాలు బంధుత్వాలు ఏమిటి? అలకు బన్నికి ఎవరితో ఏ రిలేషన్ షిప్ ఉంది? అన్నది తెలియాలంటే జనవరి 12 వరకూ ఎదురు చూడాల్సిందే. నేటికి దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఇలా ముందుకొచ్చారు.
Please Read Disclaimer