అల బన్నీ ఏంటీ ఈ కన్ఫ్యూజ్?

0

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుని నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వెండి తెర పై అల వైకుంఠపురంలో సినిమాను చూడని వారు ఎప్పుడెప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ పై వస్తుందా అని ఎదురు చూశారు. ఎదురు చూపులకు బ్రేక్ వేసి ఈ చిత్రాన్ని నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలు పెట్టారు.

అదేంటీ ఈ సినిమాను సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది కదా అంటారు. ఈనెల 25వ తారీకు వరకు సన్ నెక్ట్స్ లోనే ఈ సినిమా వస్తుందని అంతా ఎదురు చూశారు. కాని నిన్న ఈ సినిమా సన్ నెక్ట్స్ లో కాకుండా నెట్ ప్లిక్స్ లో ప్రత్యక్షం అయ్యింది. చివరి నిమిషంలో ప్లాట్ ఫామ్ మారింది. ఎందుకు ఇలా జరిగింది అనే విషయమై క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాని నెట్ ప్లిక్స్ లో అ వైకుంఠపురంలో సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

సన్ నెక్ట్స్ కంటే నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వొచ్చు అనే ఉద్దేశ్యంతో చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ కెరీర్ లో నిలిచి పోయే సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై కూడా మంచి విజయాన్ని దక్కించుకుంటుందని బన్నీ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-