స్టార్ వార్..ప్రేక్షకులెటు వైపు?

0

ప్రతీ సంక్రాంతి కి ఓ మూడు నాలుగు సినిమాలు విడుదలవ్వడం రెండు మూడు నెలల ముందే డేట్స్ ఫిక్స్ చేసుకోవడం కామనే. అయితే ప్రతీ ఏడాది కంటే వచ్చే ఏడాది సంక్రాంతి సినిమా లవర్స్ లో సరి కొత్త ఆసక్తి నెలకొల్పింది. దీనికి కారణం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ – అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ జనవరి 12న ఒకే రోజు విడుదలవుతుండటం.

ఒకరి తర్వాత ఒకరు ఇలా రిలీజ్ డేట్స్ ప్రకటించారో లేదో ఇక సంక్రాంతి రిలీజ్ డేట్ మేటర్ హాట్ టాపిక్ అయింది. నిజానికి ప్రతీ ఏడాది సంక్రాంతికి రెండు రోజుల గ్యాప్ లేదా ఒక రోజు తర్వాత మరో రోజు సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ రెండు బడా సినిమాలు ఇలా చెప్పాపెట్టకుండా ఒకే రోజు విడుదల తేదీలను అనౌన్స్ చేయడం అటూ డిస్ట్రిబ్యూటర్ లో కూడా భయం కలిగిస్తుంది. పైకి సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉన్నా లోపల మాత్రం ఓపినింగ్స్ విషయంలో నిర్మాతలు కూడా ఖంగారు పడే పరిస్థితి.

నిజానికి ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో ప్రేక్షకుల ముందు ప్రాధాన్యత దేనికో అర్థం కాని పరిస్థితి ఉంది. నిజానికి రెండు రోజులు రెండు సినిమాలు ప్లాన్ చేసుకోనుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి నిన్న రిలీజ్ డేట్స్ ప్రకటించే వరకూ ఈ విషయం కొందరు బడా నిర్మాతలకు కూడా తెలియకపోవడం షాకింగ్ న్యూస్. ఒక వేళ తెలిసుంటే ఏదైనా డిస్కర్షన్ జరిగి ఇద్దరు నిర్మాతలకు సర్ది చెప్పి ఉండేవారు. ఇక ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. పైగా ఎప్పటికప్పుడు పెద్ద సినిమాల విడుదల తేదీలను సర్దుబాటు చేసే అల్లు అరవింద్- దిల్ రాజు ఈ రెండు సినిమాలకు నిర్మాతగా భాగం వహించడం మరో విశేషం.
Please Read Disclaimer