మహేష్ – బన్నీ దీపావళి పోటీ ?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ – అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ రెండు సినిమాలు సంక్రాంతికి ఒకే రోజు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ మేటర్ ఇంకా నడుస్తూనే ఉండగా మరో అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇదిలా ఉంటే అదే దీపావళికి ‘అల వైకుంఠపురములో’ టీజర్ కూడా వస్తుందంటున్నారు.

ఈ రెండు సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్స్ వదిలేసారు. గ్లిమ్జ్ అంటూ హీరోనే చూపిస్తూ టీజర్స్ కూడా వదిలేసారు. ఇక మిగిలినవి కంటెంట్ తో టీజర్ – ట్రైలర్స్ మాత్రమే. అందుకే టీజర్ ను ఇదే నెలలో దీపావళి కి విడుదల చేసి శుభాకాంక్షలు తెలపాలని అనుకుంటున్నారట. సరిలేరు నీకెవ్వరు టీజర్ కి సంబంధించి ఈ వారంలోనే అనౌన్స్ మెంట్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరి ‘అల వైకుంఠపురములో’ టీజర్ అనౌన్స్ మెంట్ అప్డేట్ పై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. మరి జనవరి 12 ఒకే సారి థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి సినిమా అభిమానులకు అసలైన సంక్రాంతి పండగ తీసుకురాబోతున్న సూపర్ స్టార్ స్టైలిష్ స్టార్ ఈ లోపే దీపావళికి కూడా టీజర్స్ హంగామా చేసేలా ఉన్నారు.
Please Read Disclaimer