2020 సంక్రాంతి పుంజులు ఢీ అంటే ఢీ

0

2018 సంక్రాంతికి నాలుగు సినిమాల మధ్య వార్ నడిచింది. ఫైనల్ విన్నర్ గా విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 కాలర్ ఎగరేసింది. సైలెంటు విక్టరీ అది. ఇప్పుడు 2020 సంక్రాంతి సన్నివేశం అంతకంటే ఠఫ్ గా కనిపిస్తోంది. పోటీ చాలా తీవ్రంగా మారుతోంది.

ఇప్పటికే ఐదు సినిమాలకు సంక్రాంతి రిలీజ్ ని కన్ఫామ్ చేసేశారు. తాజాగా పక్కా క్లారిటీతో రిలీజ్ తేదీల్ని సైతం అధికారిక పోస్టర్లతో వెల్లడించారు. ఈ జోరు చూస్తుంటే సంక్రాంతి పుంజులు ఢీ అంటే ఢీ అన్నట్టే బరిలో దిగుతున్నాయని అర్థమవుతోంది. సంక్రాంతి రేస్ లో ఉన్నాం అంటూ ఇంతకుముందే హింట్ ఇచ్చిన `సరిలేరు నీకెవ్వ`రు టీమ్.. అల వైకుంఠపురంలో టీమ్ .. ఒకరితో ఒకరు పోటీపడుతూ నువ్వా నేనా అంటూ జనవరి 12న రిలీజ్ తేదీని కన్ఫామ్ చేసేయడం చూస్తుంటే పుంజులు ఢీ ఏ రేంజులో ఉండబోతోందో అర్థమవుతోంది.

సరిలేరు రిలీజ్ పోస్టర్ పై మహేష్ ఆర్మీ మేజర్ లుక్ లో అదరగొట్టాడు. ఇక అల్లు అర్జున్ తాపీగా సిగరెట్ తాగుతూ చేతిలో పందెంపుంజును పెట్టుకుని వేరొక చేత్తో వేట కొడవలిని సిద్ధం చేసి హోరాహోరీకి రెడీ అవుతున్నాం అని సిగ్నల్ ఇవ్వకనే ఇచ్చాడు. బ్లూ జీన్స్ పై రెడ్ షర్ట్ వేసి.. కాంబినేషన్ గా తలపాగా చుట్టి పూర్తిగా అల్ట్రా మోడ్రన్ పుంజులా ఉన్నాడు బన్ని. అయితే జనవరి 12వ తేదీని ఆ ఇద్దరూ లాక్ చేశారు కాబట్టి ఒకట్రెండు రోజులు అటూ ఇటూగా సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్లతో పాటే విక్టరీ వెంకటేష్ – నాగచైతన్య జోడీ నటిస్తున్న వెంకీ మామ చిత్రాన్ని సంక్రాంతికే ఖాయం చేస్తున్నారన్న సమాచారం ఉంది. అయితే ఆ సినిమా రిలీజ్ తేదీని కన్ఫామ్ చేయాల్సి ఉంది. అలాగే ఇదే సంక్రాంతికి కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇవేగాక ఇంకెవరు సడెన్ గా రేస్ లోకి వస్తారో చూడాల్సి ఉంటుంది. పోటీకొచ్చినా కనీసం నాలుగైదు రోజుల గ్యాప్ అయినా లేకపోతే ఓపెనింగ్ రికార్డులకు ఇబ్బందికరం. సంక్రాంతి సెలవులు కలిసొచ్చినా .. ఆశించిన స్థాయి ఓపెనింగులే కష్టం.
Please Read Disclaimer