సంక్రాంతి సినిమాల జోరు మామూలుగా లేదుగా

0

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల రాకకు ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది. అయినా కూడా ఆ సినిమాల జోరు.. ప్రమోషన్ హోరు చూస్తుంటే ఎప్పుడెప్పుడు సినిమాలను చూస్తామా అనిపిస్తుంది. సంక్రాంతికి రాబోతున్న ప్రధానమైన రెండు సినిమాలు సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనీల్ రావిపూడిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మరియు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ల కాంబోలో రూపొందుతున్న ‘అల వైకుంఠపురంలో’. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

రెండు సినిమాల మద్య విపరీతమైన పోటీ ఉంది. రెండు సినిమాల్లో ఏ సినిమాను తీయలేము.. ఏ సినిమాను పెట్టలేము. ఒక వైపు సూపర్ స్టార్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయితే మరో వైపు స్టైలిష్ స్టార్ మరియు త్రివిక్రమ్ లు హ్యాట్రిక్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పటికే విపరీతమైన అంచనాలను కలిగి ఉన్నాయి. ఈ సమయంలో దీపావళి పండుగ కానుకలను ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాయి.

అల వైకుంఠపురంలో సినిమా నుండి రాములో రాముల పాట దీపావళి కానుకగా వస్తే.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి ఫస్ట్ లుక్ ను మరియు మహేష్ బాబు కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ రెండు పోస్టర్ లు కూడా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా విజయశాంతి భారతి లుక్ సరిలేరు నీకెవ్వరు సినిమా స్థాయిని పెంచేస్తోంది.

అలాగే అల వైకుంఠపురంలోని రాములో రాముల పాట కూడా సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంది. మొత్తానికి ఈ రెండు సినిమాలు ఇప్పటి నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ పోటీ పడుతున్నాయి. ఖచ్చితంగా రెండు సినిమాలు కూడా మాంచి బ్లాక్ బస్టర్ సినిమాలు అయ్యేలా ఉన్నాయంటూ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నమ్మకంగా చెప్పుకుంటున్నారు.
Please Read Disclaimer