ఎన్నిసార్లు సర్దుకోవాలనేది బన్నీ వర్గం వాదన

0

సంక్రాంతి సినిమాల పోటీ.. రిలీజ్ డేట్ల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. మహేష్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఈ విషయం లో సోషల్ మీడియా లో కూడా రచ్చ జరుగుతోంది. రిలీజ్ డేట్ల సమస్య రావడానికి బన్నీ.. అతని టీమ్ కారణమని భావిస్తున్న మహేష్ ఫ్యాన్స్ కొందరు ఇప్పటికే బన్నీ సినిమాను బాయ్ కాట్ చెయ్యాలని ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే బన్నీ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోను వెనకేసుకొస్తూ తప్పు మహేష్ టీమ్ వైపు ఉందని.. సరిలేరు నీకెవ్వరు టీమ్ ఈ పరిస్థితి కి కారణమని కౌంటర్లు ఇస్తున్నారు.

నిజానికి మహేష్.. అల్లు అర్జున్ మధ్య పోటీ ఇప్పటిది కాదని. ‘భరత్ అనే నేను’.. ‘నా పేరు సూర్య’ రిలీజ్ సమయంలో కూడా రిలీజ్ డేట్ విషయంలో ఇలానే పోటీ వచ్చిందని.. అప్పుడు అల్లు అర్జున్ పరిస్థితిని అర్థం చెసుకుని మహేష్ సినిమాకు కోసం తమ సినిమా డేట్ ను మార్చుకున్నాడని అంటున్నారు. ఇప్పుడు కూడా అలానే మహేష్ సినిమాకు స్పేస్ ఇవ్వాలని అనుకున్నారట. అందుకే ఒక రోజు ఆలస్యంగా వచ్చేందుకు మొదట్లో సమ్మతించారు. అయితే అగ్రిమెంట్ ప్రకారం థియేటర్లు ఇవ్వరని.. మహేష్ సినిమా వైపు దిల్ రాజు మొగ్గు చూపుతున్నాడని సమాచారం అందడంతో బన్నీకి కోపం వచ్చిందని.. తగ్గే కొద్ది కావాలని రెచ్చగొడుతున్నారని భావించి పోటీకి సై అన్నాడట. ఒకే రోజు రిలీజ్ చేస్తే అప్పుడు సత్తా తెలుస్తుందని డిసైడ్ అయ్యాడట. ఈ సమయం లో గీతా వారు ‘సరిలేరు నీకెవ్వరు’ కంటే ఒక రోజు ముందు వస్తే ఎడ్వాంటేజ్ ఉంటుందని.. క్లాష్ కూడా అవసరం లేదని చెప్పడంతో అలాగే ఫిక్స్ అయ్యారట. ఈ విషయం తెలిసి మహేష్ కూడా ‘అల వైకుంఠపురములో’ ఎప్పుడు రిలీజ్ చేస్తే తమ సినిమాను అప్పుడు రిలీజ్ చెయ్యాలని పట్టుబడుతున్నాడట.

రిలీజ్ డేట్ల హంగామాలో బన్నీ తప్పేమీ లేదని.. ఎన్నిసార్లు సర్దుకోవాలి.. ఈ సారి కుదరదు అంటూ బన్నీ తరఫు వారు తమ వాదన వినిపిస్తున్నారు. ఈ సమస్య ఎదురు కావడంలో దిల్ రాజు హస్తం ఉందని కూడా ఆరోపిస్తున్నారు. మరి ఎవరు ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడతారో.. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం దక్కుతుందో వేచి చూడాలి.
Please Read Disclaimer