వైకుంఠపురంలో బన్నీ ఫిక్స్

0

మొన్నటి నుంచి ప్రచారంలో ఉన్నట్టుగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు అల వైకుంఠపురములో టైటిల్ ఫిక్స్ అయ్యింది. దీనికి సంబంధించి పోస్టర్ లుక్ రూపంలో కాకుండా యూనిట్ వీడియోగా విడుదల చేసి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. కేవలం 40 సెకండ్లు మాత్రమే ఉన్న వీడియోలో సంప్రదాయబద్ధంగా ఉన్న ఓ పెద్ద ఇంటిని హై లైట్ చేస్తూ దాని పేరే వైకుంఠపురము అని అర్థం వచ్చేలా కట్ చేసిన తీరు బాగుంది.

దీన్ని బట్టి కథలో కీలక భాగం ఈ వైకుంఠపురం చుట్టూ తిరుగుతుందన్న మాట. మరి అల్లు అర్జున్ అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అతను పెట్టుకున్న లక్ష్యం ఏమిటి లాంటి ప్రశ్నలకు ఇందులోనే సమాధానం దొరకడం కష్టం. వీడియో చివర్లో బన్నీని కూడా చూపించేశారు. తండ్రి పాత్రధారి మురళి శర్మ ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్ అని అడిగితే బన్నీ దానికి బదులుగా ఇవ్వలేదు అదే వచ్చింది అని చెప్పడం త్రివిక్రమ్ స్టైల్ లో పేలింది.

ఇన్ డైరెక్ట్ గా నా పేరు సూర్య తర్వాత వచ్చిన ఏడాదిన్నర గ్యాప్ ని బన్నీ ఈ విధంగా దీని రూపంలో సమాధానం చెప్పినట్టుగా అనిపిస్తే అందులో తప్పేమి లేదు. మొత్తానికి త్రివిక్రమ్ అంచనాలకు భిన్నంగా బయట వస్తున్న టాక్ ని పట్టించుకోకుండా అత్తారింటికి దారేది తరహాలో టైటల్ విషయంలో ఇప్పుడు కూడా వెరైటీకే పీఠం వేశాడు. ఇమేజ్ లెక్కలకు భిన్నంగా అల వైకుంఠపురములో అనే సాఫ్ట్ టైటిల్ ఎంతవరకు స్టైలిష్ స్టార్ కు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి. పూజా హెగ్డేతో సహా ఇంకే ఇతర ఆర్టిస్టులను ఇందులో రివీల్ చేయలేదు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూల్ గా ఉంది. మొత్తానికి ఫ్యాన్స్ కొంత రిలీఫ్ అయ్యేలా టైటిల్ తో పాటు బన్నీ లుక్ ని రివీల్ చేయడం విశేషం
Please Read Disclaimer