న్యూజిలాండ్‌లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్

0

భారీ అంచనాల నడుమ విడుదలైన అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం మంచి వసూళ్లను రాబడుతోంది. యూఎస్లో మంచి స్టార్ట్ అందుకున్న చిత్రం న్యూజిలాండ్‌లో అయితే రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది.

మొత్తం మూడు లొకేషన్లలో వేసిన 5 షోల ద్వారా 34,625 డాలర్లను కలెక్ట్ చేసింది. ఒక తెలుగు చిత్రం ఇంత తక్కువ షోల ద్వారా ఇంత పెద్ద మొత్తం ఇదే మొదటిసారి. గతంలో ‘బాహుబలి 2’ చిత్రం ప్రీమియర్ల ద్వారా 21,290 డాలర్లను రాబట్టింది. ఒక రకంగా బన్నీ చిత్రం ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పిందనే అనొచ్చు.
Please Read Disclaimer