వైకుంఠపురం.. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందోచ్!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. నాలుగు పాటలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. త్వరలో మ్యూజిక్ కాన్సర్ట్ కూడా జరగనుంది. ఇదిలా ఉంటే తాజాగా ‘అల వైకుంఠపురములో’ టీమ్ నుండి మరో అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. సెన్సార్ అధికారులు ఒక్క కట్ కూడా సూచించలేదని సమాచారం. ఇక ఈ సినిమా రన్ టైమ్ 156 నిముషాలుగా లాక్ అయింది. అంటే రెండు గంటల ముప్పై ఆరు నిముషాలు. సహజంగా త్రివిక్రమ్ సినిమాల రన్ టైం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే మరీ లెంగ్తీ కాకుండా ఈ సినిమా రన్ టైమ్ ను త్రివిక్రమ్ టీమ్ కుదించారు అనుకోవచ్చు. సెన్సార్ పూర్తయింది కాబట్టి రిలీజ్ కు సినిమా రెడీ అయింది. ఇక ప్రమోషన్స్ లో ‘అల వైకుంఠపురములో’ టీమ్ మరింత జోరు చూపించడం ఖాయం.

ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. టబు.. జయరాం.. సముద్రకని.. సుశాంత్.. నవదీప్.. సునీల్.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్.. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Please Read Disclaimer