రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తూ బోర్ కొట్టిస్తున్న ‘అల..’ టీమ్..!

0

త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని హాసిని అండ్ హారిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు నిర్మించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. బన్నీ – త్రివిక్రమ్ కాంబోలో గతంలో వచ్చిన ‘జులాయి’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు మ్యూజిక్ పరంగా ఎంతగా సక్సస్ ని అందుకున్నాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్ అంతకంటే పెద్ద సక్సస్ అయింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే థమన్ తన మ్యూజిక్ తో సినిమా బ్లాక్ బస్టర్ అన్న నమ్మకాన్ని తన మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా క్రియేట్ చేసాడు. ఏ పాటకి ఆ పాట ప్రత్యేకంగా ఉంటూ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ ‘బుట్ట బొమ్మ’ ‘రాములో రాములా’ సాంగ్స్ సెన్షేషన్ ని క్రియేట్ చేశాయి. ‘అల వైకుంఠపురములో’ సినిమా విజయంలో మేజర్ క్రెడిట్ అద్భుతమైన సంగీతాన్ని అందించిన థమన్ కే దక్కుతుందని ఖచ్చితం గా చెప్పొచ్చు.

‘అల వైకుంఠపురములో’ సినిమా రిలీజై నాలుగు నెలలు దాటిపోయినా ఈ పాటల సందడి మాత్రం ఆగడం లేదు. టిక్ టాక్ వీడియోలతో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ పాటలకి సెలబ్రిటీలు సైతం కాలు కదిపారంటే వాటి రీచ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లిరికల్ సాంగ్స్ ఎంతలా హిట్ అయ్యాయో వీడియో సాంగ్స్ అంతకుమించి హిట్ అయ్యాయి. దీంతో ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ ఆల్బమ్ కి 1 బిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా ఆల్బమ్ కి ఇంతటి రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయిన ఈ పాటలన్నింటికీ కలిపి వన్ బిలియన్ వ్యూస్ వచ్చి రికార్డుని నెలకొల్పింది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. రికార్డ్స్ రికార్డ్స్ అంటూ బోర్ కొట్టే వరకు రోజుకో రికార్డు ని సెట్ చేస్తున్నారు ‘అల వైకుంఠపురంలో’ టీమ్. ఈ ఆల్బమ్ కి 1 బిలియన్ వ్యూస్ రావడం గురించి ఆదిత్య మ్యూజిక్ వారితో మాట్లాడగా.. ఇది 10 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఆల్బమ్ అని.. మళ్ళీ ఇలా ఇప్పట్లో కుదరదు అని చెప్పారట. అంతే కాకుండా ఈ మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా దాదాపు 3 నుంచి 4 కోట్లు ఆదాయం ఈ మ్యూజిక్ కంపెనీకి చేకూరినట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఈ ఆల్బమ్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయబోతుందో చూడాలి.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home