త్రివిక్రమ్..తెర బరువు పెరుగుతూ ఉంది!

0

తెలుగు మూవీ మేకర్లు తమ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో ఒకరిద్దరు పేరున్న నటులను పెట్టుకుని మిగతా పాత్రలను చోటామోటా నటులతో నింపేస్తూ ఉంటారు. అయితే దర్శకరచయిత త్రివిక్రమ్ మాత్రం అందుకు భిన్నం. తన సినిమా నిండా పేరున్న ఆర్టిస్టులను పెట్టుకోవడానికే ఈ దర్శకుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. మొదటి నుంచి అలానే అయినప్పటికీ.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నుంచి ఇది మరింత ఎక్కువైంది!

ఆ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుల పాత్రలకే పెద్ద వాళ్లను తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. ఉపేంద్రలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేశాడు. స్నేహానూ చూపించాడు రాజేంద్ర ప్రసాద్ బోనస్. ఆపై అంత ప్రాధాన్యత లేని పాత్రకే నిత్యామీనన్ ను ఒప్పించాడు!

ఇక ఆ తర్వాత కూడా అదే కథ కొనసాగుతూ ఉంది. ‘అరవింద సమేత..’లో కూడా తెరనిండా గుర్తింపు ఉన్న వాళ్లను చూపించాడు. ఇక ‘అల వైకుంఠాపురం’ సినిమాకు కూడా త్రివిక్రమ్ ఫార్ములా ఏమీ మారలేదని స్పష్టం అవుతోంది.

ఈ సినిమాలోనూ రాజేంద్రప్రసాద్ తో సహా చాలా మందే కనిపిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా యూనిట్ సెల్పీలో ప్రముఖులు కనిపించారు.

వారిలో మలయాళీ నటుడు జయరాం సీనియర్ నటి టబు రాజేంద్ర ప్రసాద్ మురళీ శర్మ సచిన్ ఖేడ్కర్ తనికెళ్ల భరణి తదితరులు ఉన్నారు. ఇంకా ఈ సెల్ఫీలో కొందరు మిస్ అయ్యారట. వారే.. సుశాంత్ నివేదా పేతురాజ్ ఈ సెల్ఫీలో లేరట. మొత్తానికి తారాగణం విషయంలో త్రివిక్రమ్ సినిమా సినిమాకూ తెర బరువును పెంచేస్తూ ఉన్నట్టున్నాడు!
Please Read Disclaimer