అల రీమేక్ రైట్స్ వివాదం రాజుకుంటుందా?

0

సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్.. పూజా హెగ్డే నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈచిత్రాన్ని రాధాకృష్ణతో కలిసి అల్లు అరవింద్ నిర్మించిన విషయం తెల్సిందే. తెలుగులో హిట్ అయిన చిన్న పెద్ద సినిమాలు వరుసగా ఈమద్య బాలీవుడ్ కు క్యూ కడుతున్నాయి. అందులో భాగంగా ఈ చిత్రాన్ని కూడా రీమేక్ చేసేందుకు అక్కడ ఆసక్తి కనిపిస్తుంది. బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేయాలని పలువురు మేకర్స్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ మొత్తాన్ని ఇచ్చి రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందట. త్రివిక్రమ్ మరియు రాధాకృష్ణలు ఆ నిర్మాణ సంస్థకు అల వైకుంఠపురంలో సినిమా రీమేక్ రైట్స్ ను అమ్మాలని భావిస్తుండగా అల్లు అరవింద్ మాత్రం రీమేక్ రైట్స్ ను తనవద్దే ఉంచుకోవాలని భావిస్తున్నాడట. బాలీవుడ్ లో ప్రస్తుతం జెర్సీ రీమేక్ ను నిర్మిస్తున్న అల్లు అరవింద్ ఆ తర్వాత ఈ చిత్రాన్ని అక్కడ రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.

త్రివిక్రమ్.. రాధాకృష్ణలు మాత్రం రీమేక్ రైట్స్ ను ఆ నిర్మాణ సంస్థకు భారీ మొత్తానికి అమ్మాలని నిర్ణయించుకున్నారట. దాంతో రీమేక్ రైట్స్ విషయంలో నిర్మాతల మద్య సైలెంట్ వార్ నడుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ లాభాలు వచ్చిన సినిమాను ఎందుకు అలా వదిలేయడం అని.. హిందీలో తానే రీమేక్ చేసి క్యాష్ చేసుకోవాలని అల్లు అరవింద్ భావిస్తుండగా.. భారీ మొత్తానికి రైట్స్ అమ్మేసి చేతులు దులుపుకోవాలని మరో నిర్మాత భావిస్తున్నాడట. వీరిద్దరిలో ఎవరి నిర్ణయం ఫైనల్ అయ్యేనో చూడాలి.

మరో వైపు ఈ రీమేక్ లో సల్మాన్ ఖాన్ నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడట. ఇటీవల ఈ చిత్రం గురించి విన్న సల్లూ భాయ్ ఖచ్చితంగా చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. దాంతో అక్కడ ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఉంది. రీమేక్ అయితే కన్ఫర్మ్ గా అనిపిస్తుంది కాని ఎవరు నిర్మిస్తారు.. ఎవరు డైరెక్ట్ చేస్తారు.. ఎవరు నటిస్తారనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-