అల నైజాం బాహుబలి రికార్డు కు ఇంకెంత దూరం?

0

అల్లు అర్జున్.. త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. అయితే కొన్ని ఏరియాల్లో ఇప్పుడు బాహుబలి మొదటి పార్ట్ రికార్డులకు ఈ చిత్రం ఎసరు పెట్టింది. ఒకటి రెండు చిన్న ఏరియాల్లో ఇప్పటికే బాహుబలి 1 ని క్రాస్ చేసింది. కాని మెయిన్ గా చిత్ర యూనిట్ సభ్యులు నైజాంలోని బాహుబలి 1 రికార్డును క్రాస్ చేయాలని పట్టుదలగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

నైజాం ఏరియాలో బాహుబలి 1 చిత్రం లాంగ్ రన్ లో దాదాపుగా 43 కోట్ల షేర్ ను వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు అల వైకుంఠపురంలో చిత్రం దాదాపుగా 40.75 కోట్ల షేర్ తో మూడవ స్థానంలో ఉంది. ఈ వీకెండ్ లో కాస్త ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల ఆ రెండున్నర కోట్లు వసూళ్లు దక్కించుకుని బాహుబలి 1 రికార్డును బ్రేక్ చేయాలని వైకుంఠపురంలో టీం ఆశపడుతోంది. అందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

నైజాం ఏరియాలో ప్రస్తుతానికి చిన్న సినిమాలు తప్ప పెద్దగా పోటీ ఏమీ లేవు. నేడు విడుదలైన సినిమాలతో పాటు డిస్కోరాజా బాక్సాఫీస్ వద్ద ఉన్నాయి. ఆ సినిమాల కంటే ముందుండాలంటే భారీ ప్రమోషన్స్ చేయడంతో పాటు ఎక్కువ స్క్రీన్స్ లో సినిమాను ఆడించాలని అల్లు అరవింద్ భావిస్తున్నాడట. ఆదివారం వరకు నైజాం ఏరియాలో ఎక్కువ థియేటర్ల లో అల వైకుంఠపురంలో సినిమా ఆడేలా ప్లాన్ చేస్తున్నారట. అలా చేయడంతో ఆ బ్యాలన్స్ షేర్ ను దక్కించుకుని బాహుబలి 1 ను క్రాస్ చేస్తుందని ఆశ పడుతున్నారు.

మూడవ వారంలో అంత షేర్ అంటే సాధ్యం అయ్యే విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని అక్కడ ఉన్నది అల్లు అరవింద్ కనుక ఆయన తన పబ్లిసిటీతో ఖచ్చితంగా ఈ వీకెండ్ కు కాకున్న లాంగ్ రన్ లో ఖచ్చితంగా బాహుబలి 1 రికార్డును బ్రేక్ చేయించడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. మరి ఏం జరుగబోతుందో వెయిట్ అండ్ సీ.
Please Read Disclaimer