పాకిస్థాన్‌లో రచ్చపుట్టిస్తున్న ‘సామజవరగమన’

0

ద్యావుడా… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి సౌత్, నార్త్ ఇండియాలోనే కాదు దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. బన్నీ నటిస్తున్న ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని మొదటి పాట అయిన ‘సామజవరగమన’ పాటపై పాక్‌లో డిబేట్ జరుగుతోంది. ముగ్గురు పాకిస్థానీలు కలిసి ఈ పాట గురించి చర్చించుకుంటూ తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారికి సినిమా పేరు, హీరో హీరోయిన్ల పేరు పలకడం రాకపోయినా బన్నీ గురించి, ఈ పాట గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు.

అంతేకాదు బన్నీ నటించిన ‘సరైనోడు’ సినిమా గురించి కూడా మాట్లాడారు. ఈ వీడియో సాంగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేశారు. సినిమా జనవరిలో రిలీజ్ అవుతోందంటూ తెగ ఎగ్జైట్ అయిపోయారు. పాట లిరిక్స్, భాష అర్థంకాకపోయినా పాట వినడానికి చాలా బాగుందని, అల్లు అర్జున్ హ్యాండ్సమ్‌గా, పూజా హెగ్డే బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నారంటూ తెగ పొగిడేస్తున్నారు. ఈ వీడియోను పాకిస్థానీయులు కూడా తప్పకుండా చూడాలని తెలిపారు. ఈ వీడియోను అల్లు అర్జున్, ఆయన ఫ్యాన్స్ చూస్తే చాలా ఖుష్ అవుతారు.

‘అల వైకుంఠపురంలో’ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తు్న్నారు. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలీదు కానీ మ్యూజిక్‌కి మాత్రం విపరీతమైన స్పందన వస్తోంది. ‘సామజవరగమన’ మోస్ట్ లైక్డ్ సౌత్ ఇండియన్ సాంగ్‌గా నిలిచింది. ఆ తర్వాత విడుదలైన ‘రాములో రాములా’ పాటకు కూడా మంచి స్పందన వచ్చింది. నిన్న ఈ సినిమాలోని ‘ఓ మై డ్యాడీ’ అనే పాటను విడుదల చేశారు. ఇందులో టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Please Read Disclaimer