శ్రీదేవి రేంజులో కత్రిన నటించగలదా?

0

బాలీవుడ్ క్లాసిక్ హిట్ `మిస్టర్ ఇండియా`కి వీరాభిమానులున్నారు. అనీల్ కపూర్ స్టార్ డమ్ పెంచిన సినిమాల్లో ఈ క్లాసిక్ మూవీ ఒకటి. అలాగే ఈ మూవీలో శ్రీదేవి అసమాన నట ప్రతిభ నేటికీ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్. అయితే అలాంటి క్లాసిక్ సినిమా టైటిల్ ని ఉపయోగించి కత్రిన ప్రధాన పాత్రలో సూపర్ హీరో సినిమా తీస్తున్నానంటూ ప్రకటించారు అలీ అబ్బాస్ జాఫర్. సల్మాన్ కథానాయకుడిగా నటించే నాలుగు సినిమాల ఫ్రాంఛైజీలో ఒక మూవీని కత్రినతో ప్లాన్ చేస్తున్నానని వెల్లడించారు. మిస్టర్ ఇండియాలో శ్రీదేవి పాత్రను కానీ లేదా అనీల్ కపూర్ పాత్రను కానీ స్ఫూర్తిగా తీసుకుని కత్రిన పాత్రను రూపొందిస్తాడా? అన్న సందేహాలు ఈ సందర్భంగా వ్యక్తమయ్యాయి.

నిజానికి ఈ మూవీని ఇంతకుముందు అలీ అబ్బాస్ జాఫర్ ప్రకటించినప్పుడు మిస్టర్ ఇండియా (1987) మాతృక హీరో అనీల్ కపూర్ .. దర్శకుడు శేఖర్ కపూర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే అనీల్ కపూర్ గారాలపట్టీ సోనమ్ కపూర్ ఆ ప్రయత్నం విరమించుకోవాల్సిందిగా అలీ అబ్బాస్ జాఫర్ పై విరుచుకుపడ్డారు. కపూర్ ఫ్యామిలీ అభిమానులు సోషల్ మీడియాల్లో జాఫర్ పై ట్రోలింగ్ చేశారు.

నాకు తెలియకుండా మిస్టర్ ఇండియా సీక్వెల్ (మిస్టర్ ఇండియా 2)ని తెరకెక్కించేస్తున్నారా? కేవలం మా సినిమా టైటిల్ ని ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారనే అనుకుంటున్నాను!! అందులో పాత్రల్ని కానీ కథను కానీ మా అనుమతి లేకుండా వాడుకోవడానికి లేనే లేదు!! అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు మిస్టర్ ఇండియా (1987) దర్శకుడు శేఖర్ కపూర్. ఒరిజినల్ క్రియేటర్ అనుమతి కోరాల్సిందేనని ఆయన వాదించారు. దీనికి నెటిజనుల నుంచి మద్ధతు లభించింది.

క్లాసిక్ కథను కానీ.. పాత్రను కానీ కాపీ కొట్టాలనుకుంటే అది బ్యాడ్ ఐడియా! అంటూ పలువురు నెటిజనులు జాఫర్ పై అక్షింతలు వేశారు. అలాంటి కల్ట్ క్లాసిక్ ని రీమేక్ చేయడం సరికాదని కూడా ఖండించారు. శ్రీదేవి పెర్ఫామెన్స్ ని వేరే ఎవరూ మ్యాచ్ చేయడం కుదరదని కూడా వాదించారు. శ్రీదేవి రేంజులో కత్రిన నటించగలదా? అన్న వాదనా వినిపించింది.
Please Read Disclaimer