హౌస్ లో సెలబ్రెటీ అయిన అలీ..

0

బిగ్ బాస్ టాలెంట్ షో లో అలీ అదరగొట్టాడు. బుధవారం ఎపిసోడ్ కి కొనసాగింపుగా జరిగిన టాలెంట్ షోలో నలుగురు ఇంటి సభ్యులు ఫైనల్ కి చేరుకున్నారు. అలీ- రవి- మహేశ్- వరుణ్ లు ఫైనల్ చేరుతున్నట్లు జడ్జిలుగా ఉన్న బాబా భాస్కర్- శ్రీముఖిలు ప్రకటించారు. దీంతో వారి మధ్య మరో పోటీ జరిగింది. ఈ పోటీలో భాగంగా జడ్జిలు బాబా- శ్రీముఖిలు మొదట ‘పంచదార బొమ్మ’పాటకి స్టెప్పులు వేసి అలరించారు.

ఆ తర్వాత అలీ ఒక మంచి స్కిట్ చేశాడు. ప్రేమించిన అమ్మాయిని ఒక యాక్సిడెంట్ లో కోల్పోతాడు. తాను ఒంటరైపోతాడు. ఆమె జ్ఞాపకాలను తలచుకుని ఏడుస్తాడు. ఇక అలీ యాక్టింగ్ కి చిన్ని చిన్ని ఆశే అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయి మరింత ఎమోషనల్ చేసింది. అలీ యాక్టింగ్ కి ఇంటి సభ్యులు అంతా కన్నీరు పెట్టుకున్నారు. ఇక మహేశ్ డబ్బులు మాట్లాడితే ఎలా ఉంటుందో దాని ఫీలింగ్స్ మాటల రూపంలో చెప్పాడు. అలాగే రవి ప్రేమించిన అమ్మాయిని కోల్పోయి పిచ్చోడిలా నటించి అందరి మన్ననలు పొందాడు.

చివరిగా వచ్చిన వరుణ్ ‘మీ ముగ్గురు బాగా చేశారు. మీలో ఒకరు గెలవాలి’అని చెప్పి అత్తారింటికి దారేది సినిమాలో నిన్ను చూడగానే చిట్టిగుండే గట్టిగానే కొట్టుకుందే అనే సాంగ్ పాడి అలరించాడు. వరుణ్ పర్ఫార్మన్స్ కూడా అయిపోయాక జడ్జిలు ఫైనల్ గా అలీ- రవిని ఎంపిక చేశారు. ఈ ఇద్దరిలో ఎవరి స్కిట్ నచ్చిందో చెప్పమంటూ ఇంటి సభ్యులని అడుగగా ఏడుగురు అలీకి ఓటేయగా.. ముగ్గురు రవి వైపు నిలబడ్డారు. దీంతో అలీని విజేతగా ప్రకటించారు.

ఆయనకు అప్పీ ఫిజ్ జాకెట్ ను బహూకరించారు. జాకెట్ గెలుచుకున్నందుకు అలీ ఈ వారమంతా హౌస్ లో సెలబ్రెటీలా ఉంటాడు. ఈ వారం అంతా అతడు జాకెట్ ధరించే ఉండాలి. ఇంటి సభ్యులంతా అలీని సెలబ్రెటీల ట్రీట్ చేసి మర్యాదలు చేయాలి. అలాగే అలీ ఎలాంటి పని చేయక్కర్లేదు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home