అలీ కూతురు వచ్చేస్తోంది

0

ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్స్ ల్లో ఎక్కువ శాతం వారసులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త వారికి.. బయట నుండి వచ్చే వారికి ఎంతో కష్టపడితే కాని అవకాశాలు రావు. కాని స్టార్స్ కిడ్స్ కు ఈజీగా ఎంట్రీ దక్కుతుంది. ఆ తర్వాత వారు రాణించేది నిలదొక్కుకునేది వారి చేతులపై ఆదారపడి ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది స్టార్ కిడ్స్ వచ్చారు. అయితే స్టార్స్ అమ్మాయిలను వారసులుగా పరిచయం చేయడం చాలా తక్కువగా ఉంటుంది.

ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలను వారసులుగా తీసుకు వచ్చిన వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఇప్పుడు అలీ వంతు వచ్చింది. అలీ తన చిన్న కూతురు జువేరియాను సినిమాల్లోకి పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. బాల నటిగా జువేరియాను తన సినిమాతోనే అలీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ప్రస్తుతం అలీ ‘మా గంగానది’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అంత పవిత్రమైనది స్త్రీ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో అలీ హీరోగా నటిస్తుండగా నియా హీరోయిన్ గా నటిస్తోంది.

వి బాలనాగేశ్వరరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మహిళ దినోత్సవం సందర్బంగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ విడుదల సందర్బంగా అలీ మాట్లాడుతూ ఇది నాకు 1109వ సినిమా. భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలను ఒక మంచి కథాంశంతో ఈ సినిమాలో చూపించబోతున్నాం. దర్శకుడు బాల నాగేశ్వరరావు బాగా చదువుకున్న వ్యక్తి.. సినిమా పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తి అయినప్పటికి సినిమాను బాగా తీస్తున్నాడు అన్నారు.

ఇక దర్శకుడు బానాగేశ్వరరావు మాట్లాడుతూ.. మా సినిమాతో అలీ చిన్న కూతురు జువేరియాను బాల నటిగా పరిచయం చేస్తున్నాం. ఈ సినిమా తప్పకుండా అందరిని నచ్చుతుందనే నమ్మకం ఉంది. జువేరియా మంచి నటిగా ఎదిగి తండ్రికి తగ్గ కూతురుగా పేరు దక్కించుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు.
Please Read Disclaimer