బిగ్ బాస్ ఫైట్:పుల్లలు పెడుతున్నావ్..దెబ్బలు తింటావ్

0

బిగ్ బాస్ షో రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. సోమవారం ఎలిమినేషన్ నామినేషన్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్స్ లో రాహుల్ – హిమజ – అషు – మహేశ్ – పునర్నవి – శివజ్యోతి – బాబా భాస్కర్ ఉన్నారు. అయితే ఇందులో బాబా భాస్కర్ ని కెప్టెన్ గా ఉన్న అలీ డైరెక్ట్ గా నామినేట్ చేశాడు. దానిపై ఫీల్ అయిన బాబా కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. ఇక అదే విషయంపై మంగళవారం ఎపిసోడ్ లో చర్చ జరిగింది.

బాబా భాస్కర్ చాలా ఫీల్ అయ్యారని ఏడ్చారని వరుణ్ తో శ్రీముఖి చెప్పగా.. వరుణ్ – శ్రీముఖి మధ్య వర్తులుగా బాబా – అలీల మధ్య సఖ్యత పెంచేలా ప్రయత్నం చేశారు. అయితే ఈలోపు మహేష్ కల్పించుకుని ఏదో చెప్పబోవడంతో…నువ్ మధ్యలో పుల్లలు పెట్టకు అని అలీ ఫైర్ అయ్యాడు. దీంతో మహేశ్ పక్కకి వచ్చేశాడు. అయితే బాబా మాస్టారుకు సరిగా చెప్పడం రాదని అందుకే తను ఆయన భావాలని చెప్పాలని అనుకున్న అని మిగతా హౌస్ మేట్స్ కి చెప్పాడు.

అయితే ఈ చర్చ ఇంకా సాగుతుండటంతో మహేశ్ సీరియస్ అయ్యాడు. తనని పుల్లలు పెట్టొద్దన్న అలీపై మాటల దాడికి దిగాడు. మాట్లాడితే పుల్లలు పెడుతున్నా.. అని అంటున్నారు? నా వల్ల హౌస్ లో ఎవరైనా కొట్టుకున్నారా? అసలు నన్ను అనడానికి నువ్ ఎవడివి? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు దెబ్బలు తింటావ్ అంటూ మహేశ్ అలీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అలా ఇద్దరూ ఒకర్నొకరు దూషించుకుంటూ.. కొట్టుకునేందుకు సిద్ధపడ్డారు.

వాళ్లను బాబా భాస్కర్ – వరుణ్ లు అడ్డుకుని సర్ది చెప్పి అక్కడ నుండి తీసుకెళ్లిపోయారు. బాబా మాస్టర్ మహేశ్ ని గార్డెన్ ఏరియాలోకి తీసుకెళ్లిపోయారు. అక్కడ రాహుల్ కి జరిగింది చెప్పారు. రాహుల్ సైతం తనను నామినేట్ చేయడంపై బాబా భాస్కర్ – మహేష్ దగ్గర బాధపడ్డాడు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home