విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఉందనేది రోజూ అసూయతో ఈనో తాగేవాళ్లు తప్ప మిగతా ఎవరైనా ఓపెన్ గా ఒప్పుకునే విషయం. అయితే విజయ్ క్రేజ్ ను గాలివాటం అనే బ్యాచ్ కూడా తక్కువేమీ కాదు. ‘నోటా’.. ‘డియర్ కామ్రేడ్’ సినిమాల ఫలితం తీవ్రంగా నిరాశపరచడంతో విజయ్ హవా తగ్గిందని కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే అదంతా ఏమీ లేదని.. విజయ్ క్రేజ్ జస్ట్ తెలుగు రాష్ట్రాలకో.. లేదా సౌత్ కో పరిమితం కాదు బాలీవుడ్ లో కూడా ఉందని చాటి చెప్పే సందర్భం ఏదో ఒకసారి వస్తూనే ఉంది.
ఈమధ్య ఫిలిం ఫేర్ వారు ముంబై లో గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2019 కార్యక్రమం నిర్వహించారు. ఈవెంట్ పేరులోనే గ్లామర్.. స్టైల్ రెండూ ఉన్నాయి కాబట్టి ఒరిజినల్ గా గ్లామర్ ఉన్నవారు.. గ్లామర్ ను కొనుక్కునే సెలబ్రిటీలు పొలోమని ఈ కార్యక్రమానికి బారులుతీరారు. ఈ కార్యకమంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా తళుక్కున మెరిసింది. అసలే అందాల భామ.. ప్రస్తుతం డిమాండ్ పీక్స్ లో ఉండే హీరోయిన్.. దీంతో అక్కడ మీడియా వారు అలియా ను సందర్భానికి తగ్గట్టు ఒక మంచి ప్రశ్న అడిగారు. “పోయినేడాదిలో మోస్ట్ గ్లామరస్ యాక్టర్.. యాక్ట్రెస్ ఎవరు?” అనేదే ఆ ప్రశ్న. ఎక్కువ ఆలోచించకుండా “అనుష్క శర్మ.. నాకు ఆల్ టైమ్ ఫేవరేట్ యాక్ట్రెస్.. ఇంకా విజయ్ దేవరకొండ.. అతనిది అమేజింగ్ స్టైల్” అంటూ తన స్టైల్ లో జవాబిచ్చింది.
పోయినేడాది గ్లామరస్ హీరో హీరోయిన్ల పేర్లు చెప్పమంటే.. నిజానికి బాలీవుడ్ లో చాలామంది హ్యాండ్ సమ్ హీరోలు ఉన్నారు. రణబీర్ కపూర్ తో మొదలు పెడితే ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తున్న కార్తీక్ ఆర్యన్ వరకూ అందాన్ని.. స్టైల్ ను కలిపి కొట్టే హీరోలకు బాలీవుడ్ లో లోటేమీ లేదు. ఇక గ్రీక్ గాడ్ లాంటి హృతిక్ రోషన్ గ్లామర్ కు స్టైల్ కు పర్మనెంట్ గా కేరాఫ్ అడ్రెస్. అంతమందిని కాదని అలియా మన విజయ్ దేవరకొండ కు ఓటేసిందంటేనే విజయ్ క్రేజ్ బాలీవుడ్ లో ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
గతంలో మరో న్యూ జెనరేషన్ బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ఒక సందర్భంలో విజయ్ దేవరకొండ తనకు నచ్చుతాడు అని చెప్పుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం అనుపమ చోప్రా నిర్వహించిన యాక్టర్స్ అడ్డా కార్యక్రమంలలో సౌత్ నుంచి పాల్గొన్న ఇద్దరు హీరోల్లో విజయ్ ఒకరు. ఇవన్నీ కాకుండా విజయ్ తో ఒక బాలీవుడ్ సినిమా నిర్మించాలని కరణ్ జోహార్ ఆసక్తి చూపిస్తున్నాడని కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే ఫ్యూచర్ లో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు.
View this post on Instagram
Talking glamour and style with @aliaabhatt at the Filmfare #GlamourAndStyleAwards 2019.
Please Read Disclaimer