దొరికినంతా దోచుకో.. దోచినంతా దాచుకో

0

అసలు కంటే కొసరే కిక్కెక్కువ ఇస్తుంది! అసలు ఆదాయం కంటే కొసరు ఆదాయమే ఇప్పుడు కళ్లు భైర్లు కమ్మేలా చేస్తోంది. చక్కనమ్మల సినిమా అసైన్ మెంట్ల కంటే సైడ్ ఇన్ కం పరిమితిని మించిపోతుండడం ప్రస్తుతం హాట్ టాపిక్. సోషల్ మీడియా.. యూట్యూబ్.. అవార్డ్ ఫంక్షన్స్.. పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు.. కాదేదీ ధనార్జనకనర్హం! అన్న తీరుగా చెలరేగిపోతున్నారు భామలు. దీపిక.. సోనమ్.. కత్రిన.. సన్నీలియోన్ .. బ్యూటీ ఎవరైనా వీళ్ల ఆదాయాల్లో గణనీయమైన ఎదుగుదల సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. వీళ్లతో పాటే నవతరం నాయికలు ఆదాయం అలానే పెంచుకుంటున్నారు.

ఆర్.ఆర్.ఆర్ బ్యూటీగా పాపులరైన ఆలియా భట్ ఈ విషయంలో తక్కువేమీ కాదు. ఈ అమ్మడు ఒక్కో కమిట్ మెంట్ కి రూ.9-10 కోట్ల పారితోషికం అందుకుంటుందన్న సంగతి తెలిసిందే. రాజీ చిత్రంతో ఆలియా క్రేజు స్కైని టచ్ చేయడంతో నిర్మాతలు ఎంత ముట్టజెప్పేందుకైనా వెనకాడడం లేదు. దీంతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ ఆలియా దూకుడు చెప్పాల్సిన పనే లేదు. కేవలం సినిమాలతో సంపాదనే ఏం సరిపోతుంది? అందుకే ఆలియా కూడా సీనియర్ల బాటలోనే ట్విట్టర్.. ఇన్ స్టా.. యూట్యూబ్ అనే తేడా లేకుండా అన్ని మార్గాల్లోనూ ఆదాయ ఆర్జనకు ఆసక్తి చూపిస్తోంది. తాజాగా సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ ని ఆలియా ప్రారంభించేందుకు రెడీ అవుతోందట.

ఈ చానెల్లో తెరవెనక తనకు సంబంధించిన సంగతులన్నీ చూపిస్తుందట. వ్యక్తిగత.. వృత్తి గత జీవితంలోని టాప్ సీక్రెట్స్ ని ఈ చానెల్ ద్వారా అభిమానుల ముందుకు తెస్తుందట. మేకప్ వేయడమెలా.. వర్కవుట్లు.. యోగా.. మెడిటేషన్ .. తినే తిండి.. ఖాళీ సమయాల్లో వ్యాపకాలు.. ఒకటేమిటి వీలున్న ప్రతి విషయాన్ని తన చానెల్ లో ఆలియా చూపించేస్తుందట. అసలే క్రేజీ బ్యూటీ.. ఇలా చానెల్ ప్రారంభించగానే అలా లక్షల్లో ఫాలోవర్స్ ఆ చానెల్ ని అనుసరిస్తారనడంలో సందేహమే లేదు. కేవలం యూట్యూబ్ ద్వారానే ఆలియా కోట్లలో సంపాదించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. యూత్ లో అసాధారణ క్రేజు ఉన్న యువకథనాయిక కాబట్టి బ్రాండ్లు సైతం తన చానెల్లో ప్రచారానికి ఆసక్తిని చూపిస్తాయనడంలో సందేహమే లేదు. మరో వైపు ఆలియా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రియుడు రణబీర్ తో కలిసి విదేశీ విహారం చేస్తూ ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆలియా.
Please Read Disclaimer