ఆర్.ఆర్.ఆర్ నుండి అలియా అందుకే తప్పుకుంటుందా !

0

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్త క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఈ చిత్రంలో స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటులతో పాటు అజయ్ దేవగణ్ అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా ఒక న్యూస్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుండి ఆమె తప్పుకోవడం అధికారికమే అని తెలుస్తుంది. బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగూభాయి’ చిత్రంలో అలియా నటిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ లో ఈ రెండు సినిమాలు ఒకే టైంలో షూటింగ్ జరుపుకోనున్న నేపథ్యంలో ఆలియా రెండు భారీ ప్రాజెక్ట్స్ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ ఆపుకున్న ఆర్.ఆర్.ఆర్ తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ నెలలో మొదలు కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ రోల్ చేస్తుండగా రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్ర చేస్తున్నారు. డివీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనవరి 8న విడుదల కానుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-