ఆ మెగా సినిమాలో మెగాహీరో సరసన అలియా లేనట్లేనట!

0

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని బిజీ హీరోయిన్లలో యంగ్ బ్యూటీ అలియా భట్ ఒకరు. అలియా చేతిలో ప్రస్తుతం అన్నీ పెద్ద సినిమా ప్రాజెక్టులే ఉన్నాయట. ఈ లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయింది ఈ సోయగాల చిన్నది. తను చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్కి పక్కా ప్లానింగ్తో డేట్స్ లాక్ డౌన్ ముందే అడ్జస్ట్ చేసిందట. కానీ ఇప్పుడు ఇచ్చిన డేట్స్ అన్నీ వృధా అయినట్లే అని అర్ధమవుతుంది. ఎందుకంటే షూటింగ్స్ జరిగితే ఎక్కడి వారు అక్కడే అన్నీ పనులు పూర్తిచేసేవారు. కానీ కరోనా దెబ్బ ఇప్పట్లో మానేలా కనిపించడం లేదు. అలియా ఆర్ఆర్ఆర్ తో పాటు ఒప్పుకున్న అన్నీ సినిమాల కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి నానా తంటాలు పడుతుందట. ఇదివరకే పూర్తి చేయాల్సిన ఆర్ఆర్ఆర్ షెడ్యూల్.. కరోనా కారణంగా వాయిదా పడుతూనే వస్తుంది. మే నెలలో పూణే షెడ్యూల్ జరగనుందని అప్పట్లో చెప్పారు. కానీ నో ఛాన్స్. మహమ్మారి ఎఫెక్ట్ ఇంకా పెరుగుతూ వస్తుంది.

అయితే మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాంచరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక ఈ సినిమాలో చరణ్ తోడుగా ఒక హీరోయిన్ కూడా ఉంటుందని తెలిపారు. ఇంతకాలం ఆ హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్న చిత్ర బృందం.. ప్రస్తుతం ఓ హీరోయిన్ ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. చరణ్ జోడిగా మొన్నటి వరకు సమంత కియారాలు నటిస్తారని వార్తలొచ్చిన నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం.. చరణ్ సరసన అలియా భట్ నటిస్తుందని ప్రచారం చేశారు. కానీ ఆచార్యలో అలియా నటించట్లేదని చెప్పకనే చెబుతున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉందట అలియా. అంతేగాక ఆచార్య సినిమాలో పాత్రకోసం ఎవరు సంప్రదించలేదని టాక్. ప్రస్తుతం అలియా చేతిలో కరణ్ జోహార్ – బ్రహ్మాస్త్ర సడక్ 2 తఖ్త్ సంజయ్ లీల భన్సాలీ గంగూభాయ్ కత్వాడియా చిత్రాలు ఉన్నాయి.
Please Read Disclaimer