ఆలియా అండర్ వాటర్ ఫోటోషూట్

0

RRR బ్యూటీ ఆలియా భట్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. నవతరం నాయికల్లో కెరీర్ పరంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న నాయికగా పాపులరైంది. ఇతర నాయికలతో పోలిస్తే అతి తక్కువ సమయంలో నేము ఫేము సంపాదించిన ఏకైక బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు (చరణ్) భార్య సీతగా కనిపించనుంది. దర్శకధీరుడు అంతటివాడే ఏరికోరి ఆలియాను ఎంపిక చేసుకున్నారంటే తన ప్రతిభపై ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లో ఇతర నాయికలకు ఠఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. నిరంతర పోటీ ప్రపంచంలో తన స్టార్ డమ్ ని ఇమేజ్ ని నిలుపుకునేందుకు ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పటికే ఇన్ స్టా సహా సోషల్ మీడియాలో అసాధారణ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. నిరంతరం అక్కడ కొత్త ఫోటోషూట్లను అభిమానులకు షేర్ చేస్తూ ఫాలోయింగ్ తగ్గకుండా జాగ్రత్త పడుతోంది. తాజాగా వోగ్ మ్యాగజైన్ కవర్ షూట్ లో పాల్గొని ఆ ఫోటోల్ని రివీల్ చేసింది.

వోగ్ కోసం కవర్ గాళ్ గా మారిన ఆలియా నియోన్-గ్రీన్ మోనోకి డ్రెస్ లో మత్స్యకన్యను తలపించింది. ఆలియా షేర్ చేసిన మూడు ఫోటోల్లో మొదటి ఫోటోలో మోనోక్రోమటిక్ ఫ్రేమ్ లో ఆకర్షణీయంగా కనిపించింది. ఆ ఫోటోలో తీక్షణమైన చూపులతో కట్టిపడేసింది. రెండో ఫోటోలో .. హాట్-పింక్ మోనోకినిలో కాలి భాగం సొగసును ఎలివేట్ చేస్తోంది. మూడవ ఫోటోలో అలియా స్టైలిష్ నీలం ఆకుపచ్చ షోల్డర్ మోనోకిని స్లీవ్ డ్రెస్ లో మైమరిపించింది. అల్ట్రా మోడ్రన్ దుస్తుల్లో కనిపించినా.. సాంప్రదాయ చీరలో కనిపించినా ఆలియా తర్వాతనే. ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూనే ప్రియుడు రణబీర్ సాన్నిహిత్యంలోనూ తరిస్తోంది.
Please Read Disclaimer