జనవరి సినిమాలు గల్లంతు!

0

వారం వారం నాలుగైదు సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. ఇక కొత్త సంవత్సరం కానుక గా జనవరి 1న నాలుగైదు సినిమాలు రిలీజైన సంగతి తెలిసిందే. అయితే వీటిలో ఏది ఆడుతోందో తెలీని పరిస్థితి. రిలీజ్ ముందు ప్రచారార్భాటం వల్ల `బ్యూటిఫుల్` అనే ఓ సినిమా రిలీజవుతోందని జనాలకు తెలుసు. హీరోయిన్ నైనా గంగూలీ తో కలిసి ఆర్జీవీ వేదికల పై డ్యాన్సులాడుతున్న ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఆ ప్రచారం ఎలా ఉన్నా సినిమాలో మ్యాటర్ లేదని తేలిపోయింది.

ఇక ఈ సినిమా తో పాటుగా అతడే శ్రీమన్నారాయణ- ఉల్లాల ఉల్లాల -తూటా – రాజా నరసింహా చిత్రాలు రిలీజయ్యాయి. కానీ ఏం ప్రయోజనం అంతగా బజ్ లేని ఈ సినిమాలు వచ్చినట్టు కూడా జనాలకు తెలియలేదు. ఫర్వాలేదన్న టాక్ వచ్చిన సినిమాకి కూడా వీక్ పబ్లిసిటీ పెద్ద దెబ్బ కొట్టింది. అతడే శ్రీమన్నారాయణ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని టాక్ వచ్చినా పబ్లిసిటీ తేలి పోయింది. ఇక ఇతర సినిమాల గురించి ఎవరూ ఏమంత మాట్లాడుకోలేదు.

మొత్తానికి ఒకటో తారీఖు గల్లంతయ్యింది. ఆరోజు వచ్చినవి ఏవీ ఫలాల్ని అందించలేదు. దీనివల్ల అంతకుముందు వారం రిలీజైన సినిమాలకు అది ప్లస్ అయ్యింది. అప్పటికే థియేటర్ల లో ఉన్న వాటిలో వెంకీమామ.. ప్రతిరోజూ పండగే.. మత్తు వదలరా.. లాంటి చిత్రాలకు ఇది ప్లస్ అయ్యింది. జనవరి 9 వరకూ ఈ సినిమాలకే ఛాన్స్ ఉంది. ఓ రకంగా వాటికి వసూళ్ల పరంగా పెద్ద ప్లస్ అనే చెప్పాలి. జనవరి 9న దర్బార్.. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు.. జనవరి 12న అల వైకుంఠపురములో లాంటి భారీ చిత్రాలు రిలీజ్ లకు రానున్నాయి. ఇవి వస్తే అసలైన బాక్సాఫీస్ వార్ ఖాయమైనట్టే.
Please Read Disclaimer