మెగా పవర్ స్టైలిష్ స్టార్ల అరుదైన కలయిక

0

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగస్ట్ 22 ఈసారి చాలా స్పెషల్ గా నిలవబోతోంది. రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న విజువల్ అండ్ హిస్టారికల్ వండర్ సైరా విడుదలకు సిద్ధంగా ఉండటం రెండు రోజుల ముందే టీజర్ రచ్చకు రెడీ కావడం దీన్ని మరింత స్పెషల్ గా మార్చేశాయి. ప్రతి ఏడాది లాగే గ్రాండ్ గా జరిగే తన పబ్లిక్ బర్త్ డే సెలబ్రేషన్లకు చిరు దూరంగా ఉండబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలా అని ఫ్యాన్స్ నిరుత్సాహపడాల్సిన పని లేదు. దాన్ని పూడ్చేందుకు మెగా హీరోలందరూ నడుం బిగిస్తున్నారు.

శిల్పకళా వేదికగా జరగబోయే ఈవెంట్ లో అతిథులుగా మెగా కాంపౌండ్ హీరోలందరూ వస్తున్నారని టాక్. అందులో విశేషం ఏముంది అనకండి. చాలా ఏళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాబోతున్నట్టుగా హాట్ న్యూస్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అంతే కాదు రామ్ చరణ్ – అల్లు అర్జున్ – వరుణ్ తేజ్ – సాయి తేజ్ లతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ఇతర సెలెబ్రిటీలు కూడా వస్తారట ఇది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు బంపర్ గిఫ్ట్ అని చెప్పొచ్చు.

రంగస్థలం సక్సెస్ మీట్ తర్వాత పవన్ చరణ్ ఒకే స్టేజి మీద కనిపించలేదు. నా పేరు సూర్య ఈవెంట్ తర్వాత బన్నీ పవన్ లు కలిసి ఒకేవేదికను షేర్ చేసుకోలేదు. ఇక ఇప్పుడు ఈ ముగ్గురు వస్తున్నారంటే అంతకంటే అభిమానులకు కావాల్సింది ఏముంది. కొన్ని స్పెషల్ సర్ప్రైజెస్ కూడా ప్లాన్ చేసినట్టు తెలిసింది. చిరు రాకపోయినా ఆ లోటు తెలియకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు మెగా కాంపౌండ్ న్యూస్. మొత్తానికి 22న జరగబోయే రచ్చ మాములుగా ఉండటం లేదనే క్లారిటీ అయితే వచ్చేసింది. పూర్తి వివరాలు ఇంకో రెండు రోజుల్లో తెలియవచ్చు
Please Read Disclaimer