ఆ ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ అటకెక్కుతున్నాయట…!

0

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది సినీ పండితులు కూడా చెప్పలేరు. ముఖ్యంగా కోట్లలో పెట్టుబడి పెట్టి సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్స్ విషయంలో ఇలాంటివి అస్సలు చెప్పలేరు. ప్రముఖ వ్యాపారవేత్త సినిమా మీద ఇష్టంతో పన్నెండేళ్ల క్రితం ప్రొడక్షన్ లోకి దిగారు. మొదటి ప్రయత్నంలోనే టాలీవుడ్ లోని యాక్షన్ హీరోతో ఓ యావరేజ్ హిట్ ని అందుకున్నారు. ఆ తర్వాత ఒక హిట్ ఒక ప్లాప్ అనే విధంగా నెట్టుకుంటూ వస్తున్న సదరు ప్రొడ్యూసర్.. గత మూడేళ్ళ నుంచి ఏ సినిమా షూటింగ్ కూడా సజావుగా సాగలేదు. సదరు బ్యానర్ స్టార్ట్ అయిన ప్రతి ప్రాజెక్ట్ రకరకాల కారణాలతో ఎక్కడికక్కడ ఆగిపోతూ వస్తున్నాయి.

ముందుగా టాలీవుడ్ యువ హీరో ఒకరు ఈ బ్యానర్ లో మూవీ కమిట్ అయ్యాడు. దీని కోసం ఇప్పటికే అతనికి కోటి రూపాయలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ హీరో ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ చేసుకుంటూ బిజీ అయ్యాడు. ఇక డెబ్యూ మూవీతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఓ దర్శకుడుకి అడ్వాన్స్ ఇచ్చి పెట్టుకున్నారు. కానీ ఆ డైరెక్టర్ సెకండ్ ప్రాజెక్ట్ ని మూడేళ్ళ తర్వాత పెద్ద బ్యానర్ లో చేస్తున్నట్లు ప్రకటించాడు. అంటే ఆ ప్రాజెక్ట్ పూర్తై వీరి బ్యానర్ లో సినిమా చేయడానికి చాలా టైం పడుతుందని చెప్పవచ్చు.

అలానే ఈ ఏడాది ప్రారంభంలో హిట్ కొట్టి జోష్ మీదున్న ఓ హీరోకి అడ్వాన్స్ ఇచ్చారు. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ ని క్రేజీ హీరోయిన్ ని పెట్టుకొని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. అయితే మళ్లీ ఆ సినిమా అప్డేట్ లేదు. మరోవైపు ఆ హీరో వేరే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో అనే డౌట్. ఈ విధంగా ఈ నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ హోల్డ్ లో పడిపోయాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ చేసిన సినిమా కూడా సరిగా ఆడలేదు. ఫైనాన్సియల్ గా ఇబ్బందులేని ఆ ప్రొడక్షన్ హౌస్.. వేరే ఏదైనా పెద్ద బ్యానర్ తో కలిసి సినిమాలు నిర్మిస్తే లైన్ లో పడొచ్చని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. అంతేకాకుండా ఒకప్పుడు ఈ బ్యానర్ కి హిట్స్ ఇచ్చిన యాక్షన్ హీరోతో జోడీ కడితే.. మళ్ళీ ఇద్దరూ హిట్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.